కోలీవుడ్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో LEO షూటింగ్ కంప్లీట్ చేసారు. రీసెంట్ గానే షూటింగ్ పూర్తవ్వగా విజయ్ తన తదుపరి ప్రాజెక్ట్ ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో మొదలు పెట్టాల్సి ఉంది. LEO పూర్తి కాగానే విజయ్ ఇమ్మిడియట్ గా వెంకట్ ప్రభు ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతారనే అనుకున్నారు. కానీ విజయ్ అడుగులు పొలిటికల్ పార్టీ వైపు పడుతున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ పైనే చర్చలు జరుగుతున్నాయి.
విజయ్ కదలికలు, ఆయన చేసే పనులన్నీ దానినే సూచిస్తున్నాయి. అయితే విజయ్ ఈ పార్టీలోకి వెళ్లకుండా సొంత కుంపటి పెట్టే ఆలోచనలో ఉండడమే కాదు.. సెప్టెంబర్ 1న ఆయన అభిమానులకి బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. విజయ్ సెప్టెంబర్ 1న తన పార్టీని ప్రకటించబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. అందుకే ఈ మధ్యన విజయ్ తన ఫాన్స్ తో తరచు సమావేశమవుతున్నారని.. ఆయన పొలిటికల్ పార్టీ కోసమే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.
గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇలానే పొలిటికల్ పార్టీ ప్రకటించబోయి అనారోగ్య కారణాల దృష్యా ఆయన పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారు. ఇక ఇప్పుడు విజయ్ సినిమాల్లో స్టార్ స్టేటస్ ని మెయింటింగ్ చేస్తూ ఇప్పుడు అదే క్రేజ్ తో పొలిటికల్ గాను పవర్ చూపించాలని అనుకుంటున్నారేమో.. అందుకే క్రేజ్ ఉన్న సమయంలోనే ఆయన ఇలా రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారంటున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్.