సమంత ప్రస్తుతం షూటింగ్స్ కి దూరంగా ఆధ్యాత్మికతకి దగ్గరగా ఉంది. తాను చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్స్ కంప్లీట్ చేసేసిన సమంత అమెరికా వెళ్లేందుకు సిద్దమవుతుంది. ట్రీట్మెంట్ కోసం సమంత అమెరికా వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది. మాయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకొని సమంత దాదాపు ఏడాదిపాటు సినిమాలకి విరామం ప్రకటించనట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే సమంత అమెరికా ప్రయాణం ముందు తమినాడులోని కోయం బత్తూరులో జరిగిన యోగ కార్యక్రమంలో సింపుల్ గా సామాన్యమైన అమ్మాయిలా మారిపోయి కనిపించింది.
అయితే ధ్యానముద్రలో నిలకడగా, నిశ్చలంగా కదలకుండా ఉండడం చాలా కష్టం. అయినా అది అసాధ్యం కాదు. ఇక ధ్యానం అనేది చూడడానికి సింపుల్ అయినా అది చాలా పవర్ ఫుల్ అంటూ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసిన కొద్ది సేపటికే సమంత ఛిల్ అవుతూ రిలాక్స్ అవుతూ హ్యాపీ మోడ్ లో ఉన్న పిక్ షేర్ చేసింది. గెలాటో మార్నింగ్ అంటూ అభిమానులను విష్ చేసింది.
తానెంత హ్యాపీ మోడ్ లో ఉందో ఈ పిక్ తో క్లారిటీ ఇచ్చింది. పిల్లి పిల్లతో బెడ్ మీద పడుకుని చిరునవ్వులు చిందిస్తున్న సమంత ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నిన్న ఆధ్యాత్మికత.. నేడు ఇలా ఆనందంగా కనిపిస్తున్న సమంత అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.