Advertisementt

అక్కడ కన్నా ఇక్కడే బావున్న ప్రభాస్

Thu 20th Jul 2023 12:01 PM
prabhas  అక్కడ కన్నా ఇక్కడే బావున్న ప్రభాస్
Prabhas is better in this look then that అక్కడ కన్నా ఇక్కడే బావున్న ప్రభాస్
Advertisement
Ads by CJ

ఆదిపురుష్ రిలీజ్ కి ముందు మాయమైన ప్రభాస్ మళ్ళీ ఇన్నాళ్ళకి ప్రాజెక్ట్ K గ్లిమ్ప్స్ రోజున దర్శనమిచ్చారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైట్ షర్ట్ తో ప్రభాస్ లుక్స్ చూసి ఫాన్స్ మురిసిపోయారు. కానీ ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ కేరెక్టర్ చూసి నీరుగారిపోయారు. ఇక ఆదిపురుష్ హడావిడి ముగిసింది. సలార్, ప్రాజెక్ట్ K హడావిడి సందడి మొదలైపోయింది. సలార్ నుండి టీజర్ వదిలారు అందులో ప్రభాస్ లుక్ నచ్చింది కానీ.. టీజర్ ని KGF తో పోల్చారు.

ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ K వంతు.. ప్రాజెక్ట్ K లో ప్రభాస్ సూపర్ హీరో లుక్ వదలగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఐరెన్ మ్యాన్ బాడీకి ప్రభాస్ తల తగిలించారంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈరోజు ప్రాజెక్ట్ K గ్లిమ్ప్స్ కోసం ప్రభాస్  అమెరికాలో సందడి చేసారు. ప్రభాస్ లేటెస్ట్ లుక్ బయటికి వచ్చింది. ప్రభాస్ ఇలా బయట ఫార్మల్ గా చాలా బావున్నారు. ప్రాజెక్ట్ K లుక్ లో అస్సలు బాలేదు అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. బ్లూ కలర్ కోట్ లో ప్రభాస్ తాజా లుక్స్ స్టైలిష్ గా ఉన్నాయి.

ప్రాజెక్ట్ K లో ప్రభాస్ లుక్ పై విమర్శలు వస్తున్న తరుణంలో ప్రాజెక్ట్ K నుంచి రాబోతున్న గ్లిమ్ప్స్ పై ఇప్పుడు అందరిలో అనుమానాలున్నాయి. నాగ్ అశ్విన్ ఏం చేస్తారో.. ఈ ప్రాజెక్ట్ K టీజర్ తో ఎలా మెప్పిస్తారో.. లేదంటే డిస్పాయింట్ చేస్తారా అంటూ తెగ మధనపడుతున్నారు. 

Prabhas is better in this look then that:

Prabhas new look viral

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ