టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా, అదృష్టానికి కేరాఫ్ గా కనిపిస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల డిమాండ్ మాములుగా లేదు. క్రేజీ యంగ్ హీరోల అవకాశాలు, స్టార్ హీరోల ఆఫర్స్ తో పాప దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్స్ కి సింగిల్ హ్యాండ్ తో చెక్ పెట్టేసింది. వరసగా ఎనిమిది ప్రాజెక్ట్స్, తొమ్మిదో ప్రాజెక్ట్ పై రేపో మాపో క్లారిటీ వస్తుంది. నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ తేజ్, నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ హీరోస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలయ్య బాబు లాంటి స్టార్ హీరోస్ సినిమాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం క్రేజీ హీరయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల డిమాండ్ ని బట్టి పారితోషకం పెంచేసింది అంటున్నారు. నితిన్ తో రెండో ఛాన్స్ కొట్టెయ్యబోతుంది అనే న్యూస్ తో పాటుగా ఆ మూవీ కోసం శ్రీలీల రెండు కోట్లు డిమాండ్ చేస్తుంది అనే న్యూస్ వైరల్ గా మారింది. నితిన్-వక్కంతం ప్రాజెక్ట్ లో హీరోయిన్ గానే కాకుండా.. రీసెంట్ గా VNR ట్రియో(నితిన్-వెంకీ కుడుముల) నుండి రష్మిక తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి శ్రీలీలని తీసుకోబోతున్నారట మేకర్స్.
అయితే డేట్స్ విషయంలో ఎలాగోలా అడ్జెస్ట్ చేసుకుంటాను కానీ.. ఈ ప్రాజెక్ట్ లో నటించాలంటే 2 కోట్ల పారితోషకం కావాలని శ్రీలీల అడిగినట్లుగా తెలుస్తుంది. మరి ఫుల్ క్రేజ్ లో కనబడుతున్న ఈ పాప కి రెండు కోట్లు ఇవ్వడం మేకర్స్ కి పెద్ద ప్రాబ్లెమ్ కాదు.. కానీ డిమాండ్ ని బట్టి శ్రీలీల పారితోషకం భలే పెంచేసింది అనుకుంటున్నారు. అంతే కదండీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టయ్యాలనే ఆలోచన వచ్చే శ్రీలీల ఇలా రేటు పెంచేసింది. అందులో తప్పేముంది.