రుద్రమదేవి తర్వాత దర్శకుడు గుణశేఖర్ హీరో రానా మెయిన్ లీడ్ లో హిరణ్య కశ్యప మూవీని ప్రకటించారు. అయితే రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్ లో హిరణ్య కశ్యప అప్ డేట్ వచ్చి కొన్నేళ్లు గడిచిపోయింది. ఈ లోపులో గుణశేఖర్ శాకుంతలం అంటూ ఓ మూడేళ్లు వేరే ప్రాజెక్ట్ మీదకి వెళ్లిపోయారు. హిరణ్య కశ్యప అనౌన్సమెంట్ వచ్చాక రానా పలు సినిమాలు చేసాడు. ఇక గుణశేఖర్-రానా హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే ప్రచారం జరిగినా గుణశేఖర్ మాత్రం ఆ ప్రాజెక్ట్ ఉంది అని చెబుతూ వస్తున్నారు.
ఈలోపులో రానా అమెరికాలో ప్రభాస్ ప్రాజెక్ట్ K కోసం వెళ్ళాడు. అక్కడ నుండే రానా తన డ్రీం ప్రాజెక్ట్ హిరణ్య కశ్యపపై అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. హిరణ్య కశ్యప లుక్ తో ఈ ప్రాజెక్ట్ ని రానా అనౌన్స్ చేసాడు. రానానే ఇందులో హిరణ్యకశ్యపుడి పాత్ర పోషించబోతున్నాడు. ఈ సినిమా అమర్ చిత్రకథల స్ఫూర్తితో తెరకెక్కనున్నట్లు గా చెప్పిన రానా.. ఈ సినిమాకు స్క్రిప్టు అందిస్తున్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ప్రకటించాడు. ఇదంతా ఓకె కానీ దర్శకుడిపై మాత్రం రానా ఎటువంటి క్లూ ఇవ్వలేదు.
కానీ ఈ ప్రాజెక్ట్ నుండి గుణశేఖర్ ని తప్పించారనేది మాత్రం క్లియర్ గా అర్ధమవుతుంది. దానితో ఈ ప్రాజెక్ట్ పై గుణ శేఖర్ ఇండైరెక్ట్ గా స్పందించారు. నాకు అన్యాయం జరిగితే మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా వెళ్తా. అది ఎవరైనా సరే అంటూ రానా హిరణ్య కశ్యప అనౌన్సమెంట్ పై గుణశేఖర్ స్పందించారు.