అందరూ ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నా సూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు ప్యాన్ ఇండియా మూవీ మొదలు పెట్టలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేసారు. ఇక రాజమౌళితో చెయ్యబోయే మూవీ తోనే మహేష్ ప్యాన్ ఎంట్రీ ఇస్తారు. కానీ ఇప్పుడు మహేష్ బాబే టాలీవుడ్ నెంబర్ 1 అంటూ కొన్ని లెక్కలు బయటికి వచ్చాయి. టాలీవుడ్ నెంబర్ 1 పొజిషన్ విషయంలో ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ ఇలా ఎప్పుడూ ఈ పేర్లు దోబూచులాడినా.. కరెక్ట్ గా ఎవరు టాలీవుడ్ నెంబర్ 1 అనేది చెప్పలేకపోయేవారు.
కానీ ఇప్పుడు మహేష్ తెలుగులో అందుకుంటున్న పారితోషకం చూస్తుంటే మహేషే నెంబర్ 1 అనాల్సి వస్తుంది. ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన హీరోలంతా 100 కోట్ల పారితోషకాలు అందుకుంటున్నారు. కానీ మహేష్ తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. తాజాగా మహేష్ గుంటూరు కారం సినిమా కోసం 78 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. అలా వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి.. గుంటూరు కారం పై భారీ అంచనాలున్నాయి.
మహేష్ ఫాన్స్ కూడా గుంటూరు కారంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే రాజమౌళితో మహేష్ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో.. ఎన్నేళ్లు పడుతుందో అని.. ఇప్పుడు గుంటూరు కారం పైనే వారు ఎక్కువగా ఆశలు పెంచుకున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ గుంటూరు కారంకి తీసుకుంటున్న పారితోషకం సోషల్ మీడియాలోనే కాదు.. టాలీవుడ్ సర్కిల్స్ లోను హాట్ టాపిక్ గా నిలుస్తుంది.