Advertisementt

ప్రాజెక్ట్ K ప్రభాస్ పోస్టర్ పై పరాచికాలు

Wed 19th Jul 2023 08:54 PM
project k  ప్రాజెక్ట్ K ప్రభాస్ పోస్టర్ పై పరాచికాలు
Netizens reaction on Project K Prabhas poster ప్రాజెక్ట్ K ప్రభాస్ పోస్టర్ పై పరాచికాలు
Advertisement
Ads by CJ

ప్రభాస్ తో పని చేస్తున్న దర్శకనిర్మాతలకు ఏమైంది. ప్రభాస్ ఫ్యాన్స్ ని మెప్పించడంలో అడుగడుగునా వారు విఫలవుతున్నారా.. అంటే.. నిజమే అనిపిస్తుంది. నిన్నగాక మొన్న ఆదిపురుష్ తో డిస్పాయింట్ అయిన ప్రభాస్ ఫాన్స్ కి సోలార్ టీజర్ బూస్ట్ అందిస్తుంది అనుకుంటే.. సలార్ టీజర్ చూసి KGF లా ఉంది అనేసారు. సరే అది మాస్ మూవీ, ప్రభాస్ మాస్ లుక్ బావుంది అని సరిపెట్టుకున్నారు అభిమానులు. ఇక కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో నాగ్ అశ్విన్, వైజయంతి వాళ్ళు క్రియేట్ చేస్తున్న హైప్ కి ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందో అని ఫాన్స్ ఊహించుకుంటూ ఊహల్లో తేలిపోయారు. 

ప్రాజెక్ట్ K గ్లిమ్ప్స్ రేపు US లో విడుదల చేస్తుండగా.. ఒకేరోజు ముందే అంటే ఈరోజు జులై 19 న ప్రభాస్ లుక్ రివీల్ చేసారు. సూపర్ హీరో, హాలీవుడ్ రేంజ్ అని ఊహించుకున్న అభిమానులకి నాగ్ అశ్విన్ ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. ప్రాజెక్ట్ K లో ప్రభాస్ లుక్ అంటూ వదిలిన నెక్స్ట్ మినిట్ నుండే దానిపై మీమ్స్, ట్రోలర్స్ చేసిన ట్రోల్స్, నెటిజెన్స్ మాట్లాడుతున్న మాటలు వింటే అయ్యో పాపం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎంత కష్టమొచ్చింది అనుకోకమానరు. సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ K ఫ్యాన్ మేడ్ పోస్టర్ నయం, ఒరిజినల్ లుక్ కన్నా అదే బావుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో ఆదిపురుష్ విషయంలోనూ ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ క్రెడిట్ కొట్టెయ్యగా.. అసలు పోస్టర్స్ కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ K ఒరిజినల్ పోస్టర్ కన్నా ఫ్యాన్ మేడ్ పోస్టర్ బెటర్ అంటూ నెటిజెన్స్ మాట్లాడుతున్నారు. నాగ్ అశ్విన్ గారు మా డార్లింగ్ ని ఏం చేద్దామనుకుంటున్నారు, అసలు ప్రాజెక్ట్K లో ప్రభాస్ తలకి వేరే బాడీ ని తగిలించారా.. అది కూడా సరిగ్గా గ్రాఫిక్ చెయ్యలేకపోయారంటూ పరాచికాలాడుతున్నారు.

Memu #Sujeeth ni thittinam 

#RadhaKrishna ni thittinam 

#Omraut ni thittinam kani #NagAshwin ninnu yeppudu titaleduu

adi ma samskaram...

It's clear raa... same VFX editor worked for both the movies 🤦🏻🙏🏻 

hope it doesn't turn out like Aadipurush 🎞️ result

Rey Asalu Em Chesthunnaru ra Maa Darling Ni 🥹🥹🥲🥲💔

నెటిజెన్స్, మీమర్స్ ఇలా మట్లాడడం కాదు కానీ.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ K విషయంలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఆకట్టుకున్నట్టుగా ఫస్ట్ లుక్స్ ఆకట్టుకోలేదని.. ఈ మీమ్స్, ట్రోల్స్ ద్వారా అర్ధమవుతుంది. మరి ఎంతో బిల్డప్ ఇచ్చిన ప్రాజెక్ట్ K మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ని ఫుల్ గా డిస్పాయింట్ చేశారనడంలో ఎలాంటి సందేహము లేదు.

Netizens reaction on Project K Prabhas poster:

Fans are disappointed with Prabhas Project K look

Tags:   PROJECT K
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ