సమంత ప్రస్తుతం షూటింగ్స్ అన్నిటికి బై బై చెప్పేసింది. విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన సమంత.. అటు హిందీలో భారీగా తెరకెక్కుతున్న సిటాడెల్ వెబ్ సీరీస్ షూట్ ని ఫినిష్ చేసింది. ఇక ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఓ ఏడాది పాటు సమంత సినిమాలకి విరామం ప్రకటించబోతుంది. కాదు ప్రకటించేసింది. మాయోసైటిస్ నుండి కొద్దిగా కోలుకున్న సమంత మళ్ళీ ఆరు నెలలుగా విరామం లేకుండా వర్కౌట్స్, షూటింగ్స్ అంటూ కష్టపడింది. తన వ్యాధి ఇంకా పూర్తిగా నయం కానీ కారణంగానే సమంత ఓ ఏడాది పాటు ఆరోగ్యంపై శ్రద్ద పెట్టేందుకు కొత్త ప్రాజెక్టును ఒప్పుకోవడం లేదు.
షూటింగ్స్ అన్నిటిని ఫినిష్ చేసిన సమంత అమెరికా వెళ్లబోతుంది.. అక్కడే ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. సమంత అమెరికాకి వెళ్లే ముందు మానసిక స్థైర్యం కోసం గుడులు గోపురాలంటూ తిరుగుతుంది. గతంలో చైతూతో విడాకులు అయ్యాక సమంత తన స్నేహతులతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర అంటూ చాలా గుడులు గోపురాలు తిరిగింది. తాజా మరోసారి సమంత ఆధ్యాత్మియకతకి దగ్గరైంది. రీసెంట్ గానే ఆమె తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్ కి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించింది.
అలాగే యోగ గురువు సద్గురు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి సమంత హాజరైంది. తమిళనాడులోని కోయంబత్తూరు లో జరిగిన యోగ కార్యక్రమంలో సమంత సామాన్య భక్తురాలిగా అక్కడ దర్శనమిచ్చింది. ఆమె యోగ కార్యక్రమానికి హాజరైన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎలాంటి కదలిక లేకుండా, మెలికలు తిరగకుండా, ఎలాంటి ఆలోచనలు చెయ్యకుండా,నిశ్చలంగా నిలకడగా కూర్చోవడం అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైనది అని తెలిసింది. ఇంత సింపుల్ గా కనిపించే ధ్యానం ఇంత పవర్ ఫుల్ గా ఉంటుంది అని ఎవరూ అనుకోరు అంటూ సమంత చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.