జులై 28 న రాబోతున్న పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల BRO పై ప్రేక్షకుల్లో స్పెషల్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కేవలం మెగా ఫాన్స్ మాత్రమే కాదు.. అందరూ ఈచిత్రంపై ఉత్సుకతతో కనిపిస్తున్నారు. పెద్ద సినిమాలు ఈ ఏడాది వేసవి సెలవలని బాగా నిరాశపరిచాయి. పవన్ కళ్యాణ్ BRO తో అయినా బాక్సాఫీసు కదులుతుంది అని ఆశపడుతున్నారు. గత నెలలో సామజవరగమన చిన్న సినిమాగా పెద్ద విజయం సాధించగా.. ఈనెలలో బేబీ అనే చిన్న సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది. ఇక ఇప్పుడు పెద్ద సినిమా BRO పైనే అందరి చూపు ఉంది.
అయితే స్టార్ హీరోల సినిమాలకి బెన్ఫిట్ షోస్, స్పెషల్ షోస్ అంటూ అభిమానులు హంగామా చేస్తే మేకర్స్ వాటికి ప్రభుత్వాల నుండి పర్మిషన్స్ తీసుకుని ప్రదర్శిస్తూ క్యాష్ చేసుకోవడం చాలాసార్లు చూసాం. అలాగే టికెట్ రేట్స్ పెంచమంటూ ప్రభుత్వాల చుట్టూ మేకర్స్ తిరుగుతూ ఉంటారు కానీ.. BRO మేకర్స్ మాత్రం అనుకున్న బడ్జెట్ లో మేము సినిమాని పూర్తి చేయగలిగాము. BRO కి జరిగిన బిజినెస్ పట్ల కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాము. టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదు. టికెట్ ధరలు పెంచాలని మేము రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కోరలేదు.. అంటూ తెగేసి చెప్పేసారు.
ఇప్పుడున్న టికెట్ ధరలతోనే BRO ని విడుదల చేయాలి అనుకుంటున్నాం. అలాగే BRO ప్రీమియర్స్ గురించి కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు BRO ప్రీమియర్స్ పై ఆ ఆలోచన లేదు. చిన్న సినిమాలకు తమ కంటెంట్ ని చూపించి ప్రేక్షకులను ఆకర్షించడం కోసం ప్రీమియర్ షోలు వేస్తున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పెద్ద సినిమాలకు ఆ అవసరం ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద సినిమాలకి టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే బుక్ అవుతాయి. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే స్పెషల్ షో వెయ్యమని చెప్పలేం.
అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకుంటున్నాం. అంతేకాకుండా BRO చిత్రానికి బయ్యర్లు కరువయ్యారనే రూమర్ పై కూడా మేకర్స్ స్పష్టతనిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు బయ్యర్లు రాలేదనే మాటే ఉండదు. ఇప్పటికిప్పుడు హక్కులు ఇస్తామన్నా తీసుకోవడానికి ఎందరో పోటీ పడతారు. ఈ సినిమా మీదున్న నమ్మకంతో మేం సొంతంగా విడుదల చేయాలని ఓవర్సీస్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదు.. అంటూ చెప్పుకొచ్చారు.