రోజులు, గంటలు, నిముషాలు, సెకన్లు ఇలా ఎప్పుడెప్పుడు ప్రాజెక్ట్ K నుంచి ప్రభాస్ లుక్ ని చూస్తామా అని అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం, నిరీక్షణ కి తగిన ప్రతి ఫలం అన్నీ వచ్చేసాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూసారో.. దానికి మించి ప్రభాస్ ప్రాజెక్ట్ K ఫస్ట్ లుక్ అభిమానులని మెస్మరైజ్ చేసింది, పూనకాలు తెప్పించింది. మళ్ళీ బాహుబలిలో ప్రభాస్ ని చూశామా అన్న ఫీలింగ్ తెప్పించింది. ప్రాజెక్ట్ K లో సూపర్ మ్యాన్ లా ప్రభాస్ కనిపిస్తారనే ప్రచారాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ నిజం చేసారు.
ప్రభాస్ లుక్ చూసి అభిమానులు ఊగిపోతున్నారు.హెయిర్ ముడి కట్టి.. శరీరం నిండా అస్త్రాలతో ప్రభాస్ కనిపించిన తీరు అభిమానులని ఆగనివ్వడం లేదు. ప్రభాస్ లుక్ చూస్తే యోధుడిగా కనిపించారు. హాలీవుడ్ సూపర్ హీరోలను తలదన్నేలా ఆయన లుక్ ఉందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ K నుండి రేపు గ్లిమ్ప్స్, టైటిల్ రివీల్ అవ్వబోతున్నాయి. దానికన్నా ముందే దీపికా పదుకొనే లుక్, ప్రభాస్ లుక్స్ ని రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసారు మేకర్స్. అనుకున్న సమయానికి కాస్త లేట్ గా పోస్టర్స్ వదిలినా అంచనాలకు మించి అనేలా ఉన్నాయి. దీపికా పదుకొనే లుక్ నార్మల్ గానే ఉంది అన్నా.. ప్రభాస్ లుక్ మాత్రం అద్దిరిపోయింది.
జస్ట్ ప్రభాస్ పోస్టర్ తోనే పిచ్చగా అంచనాలు పెంచి నాగ్ అశ్విన్ అండ్ టీమ్ రేపు వదలబోయే గ్లిమ్ప్స్ ని ఇంకెంత పవర్ ఫుల్ గా ప్లాన్ చేసారో అనేది ఆలోచిస్తేనే ఫాన్స్ కి ఊపొచ్చేస్తుంది. అమితాబ్, కమల్ హాసన్ లుక్స్ ఇంకెంతగా అంచనాలు క్రియేట్ చేస్తాయో అంటూ ప్రేక్షకులు చాలా ఎక్కువగా ఊహల్లోకి వెళ్లిపోతున్నారు.