రామ్ చరణ్-తారక్ ఎంత మంచి ఫ్రెండ్సో.. వాళ్ళ మధ్యన ఫ్రెండ్ షిప్ బాండింగ్ చూసి అభిమానులు ఎంత ఎగ్జైట్ అయ్యేరో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో చూసాం. ఎన్టీఆర్-రామ్ చరణ్ ఎంత క్లోజ్ గా మూవ్ అయ్యారో వాళ్ళ ఫామిలీస్ మధ్యన కూడా అంతే మంచి ఫ్రెండ్ షిప్ ఉంది అనేది అప్పుడప్పుడు బయటికొచ్చిన పిక్స్ లో చూసాం. అయితే రామ్ చరణ్ కి పెళ్లయిన పదేళ్లకు ఈమధ్యనే పాప జన్మించింది. చరణ్-ఉపాసన దంపతులు తమ పాపకి క్లింకారాగా నామకరణం చేసారు.
తాను తండ్రి కాబోతున్నాను అనే వార్త తన ఫ్యామిలీతో పంచుకున్న తర్వాత ముందుగా తారక్ కే ఫోన్ చేసినట్లుగా ఆస్కార్ అవార్డ్స్ అప్పుడు అందరితో చెప్పాడు చరణ్. ఆ తర్వాత చరణ్ కి పాప పుట్టడం, బారసాల చేయడం, తారక్ సోషల్ మీడియాలో విష్ చెయ్యడం చూసాం. తాజాగా చరణ్ పాప క్లింకార కోసం తారక్ పంపించిన గిఫ్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ చరణ్ - ఉపాసనల పాప కోసం అదిరిపోయే బహుమతిని కొడుకులు భార్గవ్, అభయ్ రామ్ ల చేత స్వయంగా ఇప్పించాడట తారక్. రామ్ చరణ్-ఉపాసన-క్లింకారా పేర్లతో ఉన్న బంగారు డాలర్స్ ని ప్రత్యేకంగా తయారు చేయించి పంపించినట్లుగా తెలుస్తుంది. చరణ్ పాపకి ఎన్నో బహుమతులొచ్చినా తారక్ పంపిన కానుక చాలా స్పెషల్ గా ఉండి ఉంటుంది అంటూ తారక్ ఫాన్స్ కూడా చెప్పుకుంటున్నారు.