Advertisementt

దేవర: మరో యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్

Wed 19th Jul 2023 12:10 PM
devara  దేవర: మరో యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్
Devara new schedule starts దేవర: మరో యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో మొదలైన దేవర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఇప్పటికే ఐదు షెడ్యూల్స్ ని చక చకా కంప్లీట్ చేసారు. మొన్న శనివారమే ఓ యాక్షన్ సీక్వెన్స్ ని పూర్తి చేసిన టీమ్ ఈరోజు బుధవారం మరో కొత్త షెడ్యూల్ తో సెట్స్ మీదకి వెళ్ళిపోయింది. దేవర మొదలైనప్పటినుండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్ డేట్స్ తో వార్తల్లోనే ఉంటుంది. ఎన్టీఆర్ ఫాన్స్ ని ఏడాది కాలంగా వెయిట్ చేయించినా.. ఇప్పుడు వారానికో అప్ డేట్ అన్నట్టుగా వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

అయితే ఈరోజు నుండి శంషాబాద్ లో వేసిన ఓ సెట్ లో దేవర తదుపరి షెడ్యూల్ మొదలైనట్టుగా మేకర్స్ ఇంతకుముందే అప్ డేట్ ఇచ్చారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పాల్గొంటారని.. ఈ చిన్నపాటి యాక్షన్ సిక్వీన్స్ ని సోల్మన్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించబడుతుంది అంటూ మేకర్స్ ప్రకటించడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. కొరటాల శివ లేట్ చేస్తే చేసారు కానీ.. ఇప్పుడు మాత్రం దేవర షూటింగ్ ని యమా స్పీడుగా పూర్తి చేస్తున్నారంటూ ఖుషీగా ఉన్నారు.

సైఫ్ అలీ ఖాన్ తో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసిన కొరటాల ఇప్పుడు మిగతా వారిపై కీలక సన్నివేశాల చిత్రీకరణలో బిజీగా వున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5, 2024 న విడుదల చెయ్యబోతున్నారు.

Devara new schedule starts:

Devara latest update

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ