Advertisementt

బ్రో.. ట్రైలర్‌కి డేట్ ఫిక్సయింది

Sun 23rd Jul 2023 06:26 PM
bro,bro trailer,sai dharam tej,pawan kalyan  బ్రో.. ట్రైలర్‌కి డేట్ ఫిక్సయింది
Bro Trailer Release Date Out బ్రో.. ట్రైలర్‌కి డేట్ ఫిక్సయింది
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్‌ల కాంబినేషన్‌లో తమిళ నటుడు, దర్శకుడైన సముద్రఖని రూపొందిస్తున్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 28న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ యమా జోరుగా జరుగుతున్నాయి. హీరోయిన్స్ కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ వంటివారు ఇంటర్వ్యూలు ఇస్తూ.. చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేస్తున్నారు. 

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ కూడా బయటికి వచ్చేసింది. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ చిత్ర ట్రైలర్ విడుదలకు సంబంధించి డేట్ ఫిక్సయింది. ఇటీవల వచ్చిన టీజర్‌తో సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అవ్వగా.. ఇప్పుడు ట్రైలర్‌తో ఆ అంచనాలను మరింత హైకి చేర్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బ్రో ట్రైలర్‌ని జూలై 21న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా తెలియజేశారు. ఇప్పటి వరకు టీజర్, రెండు పాటలు విడుదలవగా.. రాబోయే ట్రైలర్‌తో సినిమాపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇక ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ్య సిత్తంకు రీమేక్‌ అనే విషయం తెలిసిందే. తమిళ్‌లో గాడ్ పాత్రలో సముద్రఖని నటించగా.. తెలుగులో ఆ పాత్రని పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మార్క్ పాత్రను తమిళ్‌లో తంబి రామయ్య చేశారు. తెలుగు వెర్షన్‌కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తుండటం. తెలుగు నెటివిటీకి అనుగుణంగా ఈ చిత్రానికి చేసిన మార్పులు కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయని చిత్రయూనిట్ భావిస్తోంది.

Bro Trailer Release Date Out:

Date Fixed for Pawan Kalyan and Sai Dharam Tej Bro Trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ