గబ్బర్‌సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయినా హరీష్ శంకర్ చాలా సహనంగానే ఉన్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంత సహనంగా వేచి చూస్తున్నాడో.. అంతే సహనంగా కామెంట్స్‌పై కూడా కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు. థేరి రీమేక్ అంటూ ఆరోపణలు వచ్చిన ప్రతీసారి.. ఫ్యాన్స్‌లో కూడా రెండు రకాలుగా చీలిపోయారు.
హరీష్ అన్న చేతిలో పడితే.. ఎలాంటి రీమేక్ అయినా ఫ్రెష్‌గా ఉంటుందని కొందరు, ఆ రీమేక్ కాకుండా కథే దొరకలేదా? అంటూ మరికొందరు మాట్లాడారు. కానీ ఇప్పుడసలు ఈ సినిమానే ఆగిపోయిందని అంటున్నారు. ఆగిపోవడం అంటే పూర్తి స్థాయిలో కాదు.. హరిహర వీరమల్లు టైప్ అనమాట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్‌గా యమా బిజీగా ఉన్నారు. వారాహి యాత్రతో ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో పవన్ ప్రభంజనం బాగా వీస్తోంది. ఇలాంటి టైమ్‌లో ప్రజలతో, ప్రజల మధ్యన ఉండాలని.. రాజకీయ మేధావులు కొందరు పవన్ కళ్యాణ్‌కి సలహాలు ఇస్తున్నారట.
అందుకే హరిహర వీరమల్లు సినిమాలానే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా గ్యాప్ దొరికినప్పుడల్లా చేయాలని పవన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘బ్రో’ సినిమాకు పవన్ ఇంకా డబ్బింగ్ చెప్పలేదని కూడా వార్తలు వినబడుతున్నాయి. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు ఇంకా 10 రోజులే టైముంది. మరోవైపు ఓజీ సినిమా యమా స్పీడ్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఉస్తాద్‌ని కొన్నాళ్ల పాటు ఆపేసి ఓజీ వరకు కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. సో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ప్రస్తుతానికి హోల్డ్‌లో పడినట్లే. అన్నట్లు హరీష్ శంకర్.. ఈ సినిమాకు బ్రేక్ రావడంతో.. రవితేజతో సినిమాకు సిద్ధం అవుతున్నట్లుగా కూడా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.