Advertisementt

దేవర అవుట్ పుట్ పై ఎన్టీఆర్ అసంతృప్తి?

Tue 18th Jul 2023 01:30 PM
ntr  దేవర అవుట్ పుట్ పై ఎన్టీఆర్ అసంతృప్తి?
NTR not happy with Devara output దేవర అవుట్ పుట్ పై ఎన్టీఆర్ అసంతృప్తి?
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా మూవీగా మార్చ్ లో మొదలైన దేవర మూవీ కి సంబందించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఎన్టీఆర్-కొరటాల శివ దేవర షూటింగ్ చాలా స్పీడుగా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు చిన్నపాటి షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఇలా ఎప్పటికప్పుడు దేవర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది.  రీసెంట్ గా రత్నవేలు.. లో లైట్ లో చేసిన యాక్షన్ ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం, దాని పట్ల ఫాన్స్ స్పందించడం, చాలా హోప్స్ పెట్టుకోవడం అంతా మనం చూసాం.

శనివారంతో మరొక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఎప్పటికప్పుడు షెడ్యూల్ రష్ చూసుకుంటున్న ఎన్టీఆర్ అవుట్ పుట్ పట్ల అంత సంతృప్తిగా లేరని తెలుస్తుంది. యూనిట్ కి చాలా కరెక్షన్స్ చెబుతున్నారట, ముఖ్యంగా కొరటాల మార్క్ సెటిల్డ్ డైలాగ్స్ కాకుండా.. కొంచెం ఎలివేటెడ్ మాస్ డైలాగ్స్ కావాలని ఎన్టీఆర్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ కూడా తన పాత పంధాని పక్కనబెట్టి కొత్త స్టయిల్లో కొంచెం మాస్ మసాలా డైలాగ్స్ యాడ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

దేవర ఎలివేషన్స్ కూడా అదే లెవల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే జనరల్ గా కొరటాల శివ సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్స్ అన్ని చాలా సాఫ్ట్ గా, కూల్ గా, సెటిల్డ్ గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఆ ఇంటర్వెల్ సీన్ చాలా హై ఇంటెన్స్ తో ఉండబోతుంది అని, ఇంటర్వెల్ బ్లాక్ నెవ్వర్ బిఫోర్, నెవ్వర్ ఆఫ్టర్ అనే రేంజ్ లో దానిని ప్లాన్ చేశారట. బడ్జెట్ కి వెనకాడకుండా దీనిని మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంటర్వల్ ఎపిసోడ్ దేవరాకి ఎక్స్ట్రార్డినరీగా ఉండబోతుంది అని తెలుస్తోంది.

NTR not happy with Devara output:

NTR is unhappy with the output of Devara

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ