Advertisementt

నయన్ ని తెగ పొగుడుతున్న విగ్నేష్

Tue 18th Jul 2023 12:14 PM
vignesh shivan  నయన్ ని తెగ పొగుడుతున్న విగ్నేష్
Vignesh praises Nayan నయన్ ని తెగ పొగుడుతున్న విగ్నేష్
Advertisement
Ads by CJ

లేడీ సూపర్ స్టార్ నయనతారని ఎనిమిదేళ్లు ప్రేమించి గత ఏడాది జూన్ లో వివాహం చేసుకున్న విగ్నేష్ శివన్ ఆ తర్వాత చాలా త్వరగా సరోగసి పద్ధతిలో తల్లితండ్రులయ్యారు. పెళ్లి కాగానే హనీమూన్, గుడులు గోపురాలు అలాగే నయనతార పెళ్ళికి ముందు ఒప్పుకున్న హిందీ ఫిల్మ్ జవాన్ షూటింగ్స్ తో ఈజంట బిజిగానే గడుపుతుంది. తాజాగా జవాన్ ప్రివ్యూ అంటూ అట్లీ దర్శకత్వంలో షారుఖ్-నయన్ జంటగా తెరకెక్కిన మూవీ ట్రైలర్ రిలీజ్ చెయ్యగా.. అందులో నయన్ కేరెక్టర్, ఆమె లుక్స్ కి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. నిన్న సోమవారం జవాన్ నుండి నయనతార ఫస్ట్ లుక్ వదిలారు.

అందులో నయనతార  పోలీస్ ఆఫర్ గా గన్ ఫైర్ చేస్తూ కనిపించిన పవర్ ఫుల్ లుక్ ని షారుఖ్ ఖాన్ షేర్ చెయ్యగా.. దానిని విగ్నేష్ శివన్ రీ ట్వీట్ చేస్తూ.. నయనతారని ఓ రేంజ్ లో పొగిడేసాడు. నిన్ను చూస్తుంటే ఆనందంగా, గర్వంగా ఉంది. షారుఖ్ అభిమానిగా ఆయన నటించిన సినిమాలన్నీ చూసిన నువ్వు ఇప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరింత ఆనందాన్నిచ్చింది. ఇలానే ఇంకా మంచి విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నాను. నువ్వు ఎంతోమందికి ఇన్స్పిరేషన్. నిన్ను చూసి నేను మాత్రమే కాదు మన ఫ్యామిలీ అంతా ఎంతో గర్వంగా ఫీలవుతుంది అంటూ విగ్నేష్ శివన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Vignesh praises Nayan:

Vignesh Shivan cheers for Nayanthara after Jawan poster

Tags:   VIGNESH SHIVAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ