Advertisementt

విడాకులకు సిద్దమైన మరో హీరోయిన్

Tue 18th Jul 2023 11:08 AM
colors swathi  విడాకులకు సిద్దమైన మరో హీరోయిన్
Another heroine who is ready for divorce విడాకులకు సిద్దమైన మరో హీరోయిన్
Advertisement
Ads by CJ

పెళ్లిళ్లు ఘనంగా చేసుకోవడం.. మ్యారేజ్ లైఫ్ ని హనీమూన్ అంటూ సరదాగా గడపడం.. రెండేళ్లు తిరక్కుండానే విడాకులకు సిద్దమవడమనేది ఈమధ్య కాలంలో సెలెబ్రిటీ జంటల్లో కామన్ గా కనిపిస్తుంది. నార్మల్ పీపుల్స్ ఇలానే పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నా అంతగా ఎక్స్ పోజ్ అవ్వరు. కానీ సెలెబ్రిటీ జంటలు మాత్రం త్వరగా ఈవిషయంలో హైలెట్ అవుతారు. మీడియాకి మేతగా మారతారు. రెండేళ్ల క్రితం సమంత విడాకులు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చెయ్యగా.. రీసెంట్ గా నిహారిక విడాకుల వ్యవహారం అంతగా పాపులర్ అయ్యింది.

తాజాగా మరో హీరోయిన్ విడాకులకు సిద్ధమయ్యింది అనే న్యూస్ వినిపిస్తుంది. నిఖిల్ సరసన స్వామి రారా, కార్తికేయ, అష్టాచెమ్మా లాంటి సినిమాల్లో నటించి ఫేమస్ అయిన కలర్స్ స్వాతి 2018 లో పైలట్ వికాస్ ని వివాహం చేసుకుంది. అప్పుడు కూడా ఎవరిని పెళ్ళికి పిలవకుండానే పెళ్లి పీటలెక్కిన స్వాతి.. పెళ్లి తర్వాత నటనకు దూరంగానే ఉంది. రీసెంట్ గానే పంచతంత్రం సినిమాలో కనిపించిన స్వాతి తన భర్త వికాస్ నుండి విడాకులు తీసుకోబోతుంది అనే ప్రచారం రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ విషయం మరోసారి వైరల్ గా మరింది.

కారణం ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాగ్రామ్ నుండి భర్త వికాస్ ఫొటోస్ ని తొలగించడమేనట. సినిమా అవకాశాల కోసం స్వాతి హైదరాబాద్ లో ఉంటూ ఉండగా.. ఆమె భర్త వికాస్ థాయిలాండ్ లో ఉంటున్నాడు. అలాగే కొన్నాళ్లుగా వీరి మధ్యన సఖ్యత లేని కారణంగానే వీరు విడిగా ఉంటున్నారని, స్వాతి నటనవైపు రావడం భర్త వికాస్ కి ఇష్టం లేని కారణంగానే స్వాతి ఇలా విడాకులకి సిద్దమైంది అనే న్యూస్ మొదలయ్యింది. మరి ఈ విషయమై స్వాతి ఏం స్పందిస్తుందో చూడాలి.

Another heroine who is ready for divorce:

Rumours on actress colors Swathi heading for divorce with her husband Vikas

Tags:   COLORS SWATHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ