ఆదిపురుష్ విడుదలకు ముందు అమెరికా వెళ్లిన ప్రభాస్ ఇంతవరకు ఎక్కడా కనిపించింది లేదు. ఆయన చేస్తున్న సలార్ పార్ట్ 1 షూటింగ్ కూడా పూర్తి కావడంతో ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలోనే రిలాక్స్ అవుతున్నారు. ఆదిపురుష్ రిజల్ట్ పై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా.. ప్రభాస్ మాత్రం స్పందించలేదు. అమెరికాలోనే సైలెంట్ గా ఉంటున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే కి సంబందించిన టైటిల్, అండ్ ట్రైలర్ అనౌన్సమెంట్స్ వరకు బయటికి కనిపించే అవకాశం లేదు అంటున్నారు. అందుకే ఆయన అమెరికాలో ఉండిపోయారని. సాన్ డియాగో కామిక్ కాన్ 2023 వేదికపై జరిగే ఈ కార్యక్రమం కోసం ఆయన హాజరు కాబోతున్నారు.
అందుకే ప్రభాస్ అక్కడే ఉండిపోయినట్లుగా తెలుస్తుంది. ఇక సలార్ రెండు భాగాలుగా విడుదల కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించడమే కాదు.. ఆ చిత్రంలో విలన్ గా నటిస్తున్న జగపతి బాబు సలార్ పై హైప్ క్రియేట్ చేసారు. సలార్ మొదటి భాగంలో తనకి-ప్రభాస్ కి ఎలాంటి కాంబో సీన్స్ లేవని.. సలార్ 2 లోనే ప్రభాస్ తో తనకి యాక్షన్ సీన్స్ ఉంటాయని చెప్పారు. సలార్ ఆషామాషీ మూవీ కాదు.. ఇది పవర్ ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ మూవీ అంటూ జగ్గు భాయ్ సలార్ పై క్రియేట్ చేసారు.