Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందా?

Mon 17th Jul 2023 10:05 AM
pawan kalyan  ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందా?
Pawan Kalyan to shelve Ustaad Bhagat Singh ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కలయికలో క్రేజీ మూవీగా తెరకెక్కుతున్నఉస్తాద్ భగత్ సింగ్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు గుప్పుమంటున్నాయి. ఎప్పుడో డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక పవన్ కళ్యాణ్ మళ్ళీ హరీష్ శంకర్ కి డేట్స్ ఇవ్వలేదు. మే లో ఒకసారి.. నిన్నగాక మొన్న అంటే జులైలో ఒకసారి ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ అంటూ, అలాగే సెట్ చూపిస్తూ ఓసారి మేకర్స్ తో అప్ డేట్ ఇప్పించారు. అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయింది అనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అటు బ్రో రిలీజ్ కి సిద్ధమైతే.. ఇటు వీలున్నప్పుడు పవన్ కళ్యాణ్ OG కి డేట్స్ కేటాయిస్తున్నారు. మరోపక్క హరి హర వీరమల్లు షూటింగ్ పై ఆ నిర్మాత నిన్న అప్ డేట్ ఇచ్చారు. ఎలక్షన్స్ లోపే సినిమా విడుదల అని. మరి ఈమధ్యలో ఉస్తాద్ పై ఎలాంటి న్యూస్ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ నుండి గ్లిమ్ప్స్ వదిలి సినిమాపై హైప్ క్రియేట్ చేసాడు హరీష్. అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ విషయం ఎటూ తేలకపోవడంతో హరీష్ శంకర్ కూడా రవితేజ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడనే టాక్ మొదలైంది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హీరోయిన్ శ్రీలీల వెయిట్ చెయ్యకుండా ఆ డేట్స్ ని ఇతర సినిమాలకి ఉపయోగించుకుంటుంది. మరి హరీష్ శంకర్ కూడా రవితేజ సినిమాపై ఫోకస్ పెడితే ఈఏడాది ఉస్తాద్ షూటింగ్ ఉండదనే ప్రచారం నిజమైనట్టే.

Pawan Kalyan to shelve Ustaad Bhagat Singh:

Pawan Kalyan gives a big shock to Ustaad Bhagat Singh

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ