Advertisementt

పవర్ స్టార్ మ్యానరిజమ్స్ తో మెగాస్టార్

Sun 16th Jul 2023 10:04 PM
bholaa shankar  పవర్ స్టార్ మ్యానరిజమ్స్ తో మెగాస్టార్
Megastar with power star mannerism పవర్ స్టార్ మ్యానరిజమ్స్ తో మెగాస్టార్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భార్య సురేఖతో అమెరికా ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. భోళా శంకర్ షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసిన మెగాస్టార్ చిరు యుఎస్ లో రిలాక్స్ అవ్వడానికి వెళ్ళారు. అయితే మెగాస్టార్ చిరు అమెరికా నుండి ఇప్పుడు భోళా శంకర్ బిగ్గెస్ట్ సీక్రెట్ ఒకటి లీక్ చేసారు. ఇది మెహర్ రమేష్ కి తెలిస్తే గొడవ చేస్తాడు కానీ అంటూ.. హాయ్ ఫ్రెండ్స్ భోళా శంకర్ ఫిల్మ్ నుంచి ఓ చిన్న విషయాన్ని లీక్ చేస్తున్నాను. విషయం తెలిస్తే మెహర్ రమేష్ గొడవ చేసేస్తాడు. అయినా ఏం పర్వాలేదు. విషయమేమిటి అంటే..

మా కళ్యాణ్ బాబు(పవన్ కళ్యాణ్) తన సినిమాల్లో అప్పుడప్పుడు నా ప్రస్తావన తీసుకురావడం, అలాగే నా డాన్సులు నుండి స్టెప్స్ వెయ్యడం, నా డైలాగ్స్ ని ఇమిటేట్ చెయ్యడం( మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్) లాంటివి ఇమిటేట్ చేసి నన్ను ఎంతగానో ఎంటర్టైన్ చేసాడు. అదే విధంగా నేను ఈ భోళా శంకర్ సినిమాలో తనని ఇమిటేట్ చేస్తూ తన మ్యానరిజమ్స్ కానివ్వండి, తన పాట కానివ్వండి యాక్ట్ చెయ్యడం జరిగింది. అది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది.. ఐ థింక్ మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అంటూ..

పవన్ కళ్యాణ్ ఏ మేరా జహాఁ .. అనే సాంగ్ ని చేస్తూ పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని చూపించారు మెగాస్టార్ చిరంజీవి. మరి ఈ విషయం మెగాస్టార్ ఇలా లీక్ చేసారో, లేదో.. అలా ఆ వీడియో వైరల్ అయ్యింది. చూసారుగా ఈ సాంగ్ చూసి ఎంజాయ్ చేసి ఉంటారుగా.. పూర్తి సాంగ్ ని సినిమాలో చూడండి.. అయితే ఈవిషయం ఎవరికీ చెప్పొద్దూ అంటూ మెగాస్టార్ పవన్ సాంగ్ ని ఇమిటేట్ చేసిన విషయాన్ని లీక్ చేసిపారేసి మెగా ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ట్రీట్ ఇచ్చేసారు. 

Megastar with power star mannerism:

Chiru leaks: Megastar to imitate Powerstar in Bholaa Shankar

Tags:   BHOLAA SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ