పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నేతలు భయపడుతున్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్ళేలోగా.. సీఐ అంజుయాదవ్ పై వైసీపీ ప్రభుత్వం చర్యలకి సిద్ధమవుతోందా.. అంటే అవుననే వినిపిస్తుంది. జనసేన కార్యకర్త కొట్టే సాయి రెండు చెంపలు చెళ్లుమనిపించడంపై కాళహస్తి పట్టణ సీఐ అంజూయాదవ్ పై పవన్‌కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. సీఐ అంజూయాదవ్ జనసేన కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చెయ్యడమేగాకుండా.. తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు. దీని కోసం ఆయన రేపు సోమవారం తిరుపతి వెళ్లనున్నారు
అయితే పవన్ కళ్యాణ్ వచ్చి తిరుపతిలో ఎస్పీ పరమేశ్వర రెడ్డిని కలిసి వినతి పత్రం ఇస్తే.. ఎక్కడ ఆయన హైలెట్ అవుతారో.. ఆయన్ని ప్రజలు ఎక్కడ మెచ్చేసుకుంటారో అని భయపడిన వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ తిరుపతికి వెళ్లకముందే అంటే ఈ రోజే సీఐ అంజూయాదవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అసలు జనసేన కార్యకర్త సాయిని అంజుయాదవ్ కొట్టడానికి దారి తీసిన పరిస్థితులు, అక్కడ ఏం జరిగిందో ఎస్పీ పరమేశ్వరరెడ్డి సమగ్ర నివేదికను అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డికి పంపినట్లుగా తెలుస్తుంది.
ఇప్పటికే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి అధికారులకి నోటీసులు పంపించింది. ఈ ఘటన వలన వైసీపీ ప్రభుత్వానికి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో.. అంజు యాదవ్ పై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగట్టే ప్రమాదం ఉండడంతో, పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లకముందే ఆమెపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది .. అసలు పవన్ అంటే భయం ఉండబట్టే ఇలా చేస్తున్నారు అంటూ జనసేన నేతలు కామెడీగా స్పందిస్తున్నారు.