హీరోయిన్ నిత్యా మీనన్ భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో కనిపించిందిలేదు. చాలా తక్కువగా సినిమాల్లో కనబడుతున్న నిత్యా మీనన్ ప్రస్తుతం వెబ్ సీరీస్ ల్లో కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిత్య మీనన్ తన అమ్మమ్మని కోల్పోయినట్టుగా ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. నిత్యా మీనన్ కి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ దూరమైనట్టుగా చెప్పింది.
ఒక శకం ముగిసింది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. గుడ్ బై అమ్మమ్మ, మై చెర్రీమ్యాన్. తాతయ్యను బాగా చూసుకుంటాను.. అంటూ నిత్యా మీనన్ తన అమ్మమ్మని కోల్పయిన బాధని సోషల్ మీడియా ద్వారా అమ్మమ్మ-తాతగారితో ఉన్న పిక్ ని అందరితో పంచుకోగా.. నిత్యా మీనన్ కి ధైర్యం చెబుతూ ఆమె అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. నిత్యా ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి.. అమ్మమ్మని కోల్పోయినా.. తాతయ్య ఉన్నారు. ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపు, ఆయనలోనే ఆమెని చూసుకో అంటూ నిత్యాకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.