Advertisementt

దేవర: పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్

Sun 16th Jul 2023 10:42 AM
devara movie  దేవర: పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్
NTR completes another action schedule దేవర: పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్స్ స్పీడు చూస్తుంటే ఎన్టీఆర్ ఫాన్స్ లో ఆనందం ఉరకలు వేస్తుంది. ఏడాది పాటు ఆగి ఆగి దేవర ని సెట్స్ మీదకి తీసుకెళ్లారు.. లేట్ అయినా ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాలలు చాలా స్పీడు గా షూటింగ్ పూర్తి చెయ్యడం ఫ్యాన్స్ లో ఉత్సహాన్ని నింపింది. వరస షెడ్యూల్స్ ని చక చకా కంప్లీట్ చేస్తున్నారు. నిన్న శనివారం మరో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని అది కూడా సముద్రం సెట్ లో ఎన్టీఆర్ కంప్లీట్ చేసేసారు. దేవర కోసం కెన్నీ బేట్స్ వంటి హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ను కూడా పిలిపించారు. 

బేట్స్ నేతృత్వంలో పలు థ్రిల్లింగ్ సన్నివేశాలను తెరకెక్కించారు. మూడు నెలల్లో 5 షడ్యూల్స్ కంప్లీట్ చేయడం మాములు విషయం కాదు.. ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీస్ షూటింగ్స్ లో ఇంత స్పీడుగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నది దేవర మాత్రమే. ఈ స్పీడుకి, హార్డ్ వర్క్ కి, డెడికేషన్ కి ఎన్టీఆర్ ఫాన్స్ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా-జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024 న ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కొరటాల శివ కూడా పూర్తి స్క్రిప్ట్ తో ఎన్టీఆర్ తో షూటింగ్ మొదలు పెట్టడం వలన, నటులు కూడా డేట్స్ పర్ఫెక్ట్ గా ఇవ్వడంతోనే దేవర షూటింగ్ ఇంత స్పీడు గా జరిగిపోతుంది.. ఎన్టీఆర్ కూడా ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా దేవర షూటింగ్ లో పాల్గొనడం కూడా చిత్రీకరణ ఇంత స్పీడుగా పూర్తి కావడానికి మెయిన్ కారణంగా తెలుస్తుంది. 

NTR completes another action schedule :

NTR completes another action schedule for Devara movie.

Tags:   DEVARA MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ