Advertisementt

బేబీకి బాగా కలిసొచ్చింది

Sun 16th Jul 2023 09:46 AM
baby  బేబీకి బాగా కలిసొచ్చింది
Baby movie collections report బేబీకి బాగా కలిసొచ్చింది
Advertisement
Ads by CJ

బేబీ ద మూవీ.. ఈ వారం ఇదే హిట్ మూవీ గా ఆడియన్స్ డిక్లెర్ చేసారు. SKN నిర్మాతగా సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం యూత్ కి బాగా నచ్చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించే వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయ్యి మొదటిరోజే 7 కోట్ల రూపాయలతో మంచి ఓపెనింగ్స్ కలెక్ట్ చేసింది. మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో శనివారం కలెక్షన్స్ కూడా అదిరిపోవడమే కాదు.. ఆదివారం బుకింగ్స్ బావున్నాయి.

అయితే బేబీకి ఇప్పుడు మరో రోజు అదనంగా కలిసొచ్చింది. ఎంత హిట్ సినిమా అయినా ఈ రోజుల్లో సోమవారం నిలబడడం కష్టంగా మారింది. సోమవారం వర్కింగ్ డే అవడంతో సినిమా థియేటర్స్ కి వెళ్ళే మూడ్ ఎవరికీ ఉండడం లేదు. కానీ బేబీ కి ఇప్పుడు సోమవారం సెలవు దినం కలిసొచ్చింది. సోమవారం తెలంగాణాలో బోనాల హాలిడే ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో బేబీ కి కలిసొచ్చింది.

మరి సోమవారం కూడా బేబీ మూవీ కి కలెక్షన్స్ బావుంటాయనడంలో సందేహం లేదు. యూత్ మొత్తం, స్టూడెంట్స్ కూడా బేబీ మూవీ ని వీక్షించేందుకు రెడీ అవుతారు. సో ఈ లాంగ్ వీకెండ్ బేబీ మూవీకి దాని కలెక్షన్స్ కి బాగా హెల్ప్ అవుతాయనడంలో ఎలాంటి అనుమానం లేదు.

Baby movie collections report :

Baby movie collectiosn details 

Tags:   BABY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ