Advertisementt

గ్లామర్ డోస్ పెంచిన కృతి శెట్టి

Sat 15th Jul 2023 11:31 PM
krithi shetty  గ్లామర్ డోస్ పెంచిన కృతి శెట్టి
Krithi Shetty Increases Glamour Dose గ్లామర్ డోస్ పెంచిన కృతి శెట్టి
Advertisement
Ads by CJ

క్యూటీ కృతి శెట్టి రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. నిన్న మొన్నటివరకు పద్దతికి మరో పేరులా ఉండే కృతి శెట్టి ఇప్పుడు పద్ధతిగా ఉంటే పని జరగదని గ్రహించింది. అందుకే గ్లామర్ షో కి తెర లేపింది. ఉప్పెన, బంగార్రాజు చిత్రాల్లో పద్దతికి పట్టు చీరకట్టినట్టుగా ఉన్న కృతి శెట్టి.. శ్యామ్ సింగరాయ్ లో మోడరన్ అవతారమెత్తినా అంతగా గ్లామర్ చూపించలేదు. ఆతర్వాత కూడా ద వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల్లో మోడ్రెన్ డ్రెస్ లు వేసినా అందాలు ఆరబోసే విషయంలో పద్దతి పాటించింది.

కానీ ఇప్పుడు చీర కట్టి ,చుడి దార్లు వేస్తె కష్టం అని కనిపెట్టింది కాబట్టే మోడ్రెన్ గాను, గ్లామర్ గాను, అందాలు ఆరబొయ్యడమే బెస్ట్ అనుకుంది. కాబట్టే రోజుకో అవుట్ ఫిట్ తో అదరగొట్టేస్తూ ఫోటో షూట్స్ వదులుతుంది. ఈరోజు కూడా బ్యూటిఫుల్ గా మోడ్రెన్ అవుట్ ఫిట్ లో కృతి శెట్టి కనిపించిన తీరుకి నెటిజెన్స్ కూడా వావ్ కృతిశెట్టి నీలో ఇంత పెద్ద మార్పా అంటూ ఆశ్చర్యపోతున్నారు. లావెండర్ కలర్ స్లీవ్ లెస్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో అందాలు చూపిస్తూ కవ్విస్తుంది.

అమ్మడుకి తెలుగు ఆఫర్స్ తక్కువైనా తమిళంలో పాగా వెయ్యడానికి రెడీ అయ్యింది. అక్కడ వరస ప్రాజెక్ట్స్ తో బిజీ తారగా మారిపోయింది. అటు మలయాళంలోనూ కృతి శెట్టి ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది.  

Krithi Shetty Increases Glamour Dose:

Actress Krithi Shetty looks alluring and cute in this photos

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ