నిన్నటివరకు స్టార్ హీరోలకి కేవలం పూజ హెగ్డే-రష్మిక మాత్రమే అప్షన్ గా కనిపించేవారు. పూజ హెగ్డే వరసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసింది. ఎన్టీఆర్ దగ్గర నుండి మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరి హీరోల సరసన రొమాన్స్ చేసింది. ఇక రష్మిక కేవలం అల్లు అర్జున్, మహేష్ లతోనే చేసింది. ఇక స్టార్ హీరోలకి వీరిద్దరే కనిపించేవారు. కానీ ఇప్పుడు పూజ హెగ్డే కి అవకాశాలు తగ్గిపోయాయి. మహేష్ మూవీ, విజయ్ దేవరకొండ మూవీస్ ఆమె చేజారిపోయాయి. అలాగే రష్మికకి అంతే. నితిన్ మూవీ నుండి రష్మిక తప్పుకుంది.
ఈలోపులో ఇద్దరు హీరోయిసం దూసుకొచ్చేసారు. వారే శ్రీలీల, మృణాల్ ఠాకూర్. శ్రీలీల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది లేదు. ఎందుకంటే టాలీవుడ్ లో ఏ హీరో చూసినా శ్రీలీల వెనకే పడుతున్నారు. యంగ్ హీరోస్, స్టార్ హీరోస్ ఇలా ఎవ్వరు చూడు శ్రీలీల నామ జపమే. ఇక సీతారామం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్ శ్రీలీల అంత స్పీడు కాకపోయినా.. మెల్లగా టాలీవుడ్ లో పాగా వేస్తుంది. ఇప్పటికే కుర్ర హీరో సరసన ఛాన్స్ లు పట్టేసింది. నాని హాయ్ నాన్నా, విజయ్ దేవరకొండ సరసన ఓ మూవీ ఓకె చేసింది.
ఈమధ్యన మృణాల్ ఠాకూర్ బుచ్చి బాబు సినిమాలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం షురూ అయ్యింది. జాన్వీ కపూర్ కూడా మెల్లగా సౌత్ లో పాగా వెయ్యడానికి సిద్దమయ్యింది. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన ఫిక్స్ అయ్యింది. ఇకపై స్టార్ హీరోల చూపు జాన్వీపై పడడం ఖాయం.