వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నాను అంటూ ఈ మధ్యన అనసూయ సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడూ విజయ్ దేవరకొండ సినిమాలపై ఇండైరెక్ట్ పోస్టులు పెట్టి రౌడీ ఫాన్స్ చేతికి చిక్కి ట్రోల్స్ బారిన పడే అనసూయ భరద్వాజ్ ఇకపై విజయ్ ఫాన్స్ తో కానీ, విజయ్ తో కానీ గొడవపడను, నాకు మనశ్శాంతి కావాలి అంటూ చెప్పుకొచ్చింది. లేదంటే సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ హడావిడి చేసేది. అయితే కొద్దిరోజులుగా తన గ్లామర్ ఫోటో షూట్ తప్పవేరే పోస్టులు పెట్టని అనసూయ ఈమధ్యన విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బేబీ సక్సెస్ అవ్వాలటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది.
అయితే ఇప్పుడు అనసూయ పెట్టిన ఓ పోస్ట్ దేని కోసం పెట్టిందో.. ఎవరి కోసం పెట్టిందో అనేది అర్ధమవడం లేదు. వావ్ నేను నిజంగా చాలా ముఖ్యమైన వ్యక్తిని, నాతో పరిచయం ఉన్నా, లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా, లేకపోయినా.. నా పేరు లేకుండా చర్చలు జరగడం లేదు అంటే మీ అందరికి నేను ఎంతెలా కావాలి అబ్బాయిలు, నాపైనే అందరూ ఆధారాపడి ఉన్నారు. నా పేరు చెప్పకుండా ఏది చెయ్యలేకపోతున్నారు అంటూ అనసూయ చేసిన ట్వీట్ వైరల్ అవ్వగా.. అసలు అనసూయ ఎందుకు ఈ పోస్ట్ పెట్టిందో మాత్రం చాలామందికి అర్ధమే కావడం లేదు.