నాగ శౌర్యని మీడియా తొక్కేసిందా.. అసలు హీరో అన్నాక ఎంత వినయంగా ఉండాలి. కానీ తన అశ్వద్ధామ సినిమా విషయంలో క్రిటిక్స్ పూర్ రివ్యూస్ ఇచ్చారు, సినిమా బావుంది కానీ చంపేశారు అంటూ నాగ శౌర్య మీడియా మీద ఫైర్ అయ్యాడు. అప్పటినుండి మీడియా మీద అవకాశం వచ్చినప్పుడల్లా సెటైర్స్ వేస్తున్నాడు. అందుకే మీడియా నాగ శౌర్యని పట్టించుకోలేదు అనేలా రీసెంట్ గా వచ్చిన అతని సినిమా రిజల్ట్ ప్రూవ్ చేసింది. నాగ శౌర్య తాజాగా రంగబలి అనే మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రమోషన్స్ పరంగా కొత్తగా ట్రై చేస్తూ మీడియా మీద స్పూఫ్ ఇంటర్వూస్ ప్లాన్ చేసాడు. కొంతమంది జర్నలిస్ట్ లని అనుసరిస్తూ చేసిన ఇంటర్వూస్ ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. కానీ అది మీడియాకి నచ్చలేదు.
ఇక నాగ శౌర్య ప్రమోషన్స్ బాగానే చేసినా తన సినిమా రిలీజ్ విషయంలో మీడియాని నెగ్లేట్ చేసాడు. దానితో మీడియా మొతం నాగ శౌర్య మీద కక్షగట్టింది అనేలా రంగబలి రిజల్ట్ ని డిక్లెర్ చేసింది. రంగబలి సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది.. కానీ సెకండ్ హాఫ్ విషయంలో దర్శకుడు ట్రాక్ తప్పాడు.. అంటూ పబ్లిక్ మాత్రమే కాదు, మీడియా వారు చెప్పారు. మీడియాకి స్పెషల్ ప్రీమియర్ కూడా వేశారు. అయితే రంగబలికి విశ్లేషకులు పూర్ రివ్యూస్ ఇచ్చారు. 1.5, 1.75. 2, 2,25 అంతే రేటింగ్స్ ఇచ్చారు. అంత తక్కువ రేటింగ్స్ వచ్చే సినిమా కాదు.. మినిమమ్ 2.5 సినిమా. కానీ అంత తక్కువ రేటింగ్స్ వేశారు అంటున్నారు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ. ఫస్ట్ హాఫ్ బావుంది, సెకండ్ హాఫ్ వీక్.. కానీ అంత తక్కువ రేటింగ్ వేసే సినిమా అయితే కాదు అంటూ మాట్లాడుతున్నారు.
మరి రిపోర్ట్స్ పరంగా బావున్నాయి. కానీ కలెక్షన్స్ పరంగా సినిమా పోయింది. దానికి కారణం నాగ శౌర్య యాటిట్యూడ్.. మీడియాతో పెట్టుకుంటే ఏమవుతుందో అనేది ఈ కుర్ర హీరో అర్ధం చేసుకుంటే బావుంటుంది అంటూ నెటిజెన్స్ అతనికి హితబోధ చేస్తున్నారు.