వైసీపీ నేతలకి ఇప్పుడు చంరబాబు-పవన్ కళ్యాణ్ కలిసిపోయి తమని ఎక్కడ ఓడించేస్తారో అనే భయం పట్టుకుంది. అసలు వారిద్దరూ కలవకపోయినా.. వీళ్ళు మాత్రం కలిపేసి మట్లాడేస్తున్నారు. TDP-జనసేన పొత్తు పెట్టుకుంటారో.. లేదో ..తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ ఏం మట్లాడినా అది చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టినా, ఎత్తి చూపినా పవన్ కళ్యాణ్ వెనుక చంద్రబాబే ఉంటారు. అలా అనకపోతే చంద్రబాబు - పవన్ కలిసిపోయి రాజకీయాలు చేస్తే తాము ఓడిపోయినట్లే.. అదే వాళ్ళ బాధ.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కూడా చంద్రబాబు చెబితేనే పవన్ చేస్తున్నాడు. ఇది వైసీపీ వాదన. కావాలనే ఇలా చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ని లింక్ పెట్టి మాట్లాడితే.. వీళ్ళు కలవకుండా ఉంటారు అది వైసీపీ ప్లాన్. లేదంటే ప్రస్తుతం ఏపీలో YCP పై ఉన్న వ్యతిరేకత ఈ ఎలక్షన్స్ లో కనిపించడం ఖాయం. అందుకే పవన్ కళ్యాణ్ చిన్న మాటన్నా అది చంద్రబాబే మాట్లాడించారని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుని వైసీపీ నేతలు, మంత్రులు ఆఖరికి సీఎం జగన్ కూడా పవన్ ని దత్తపుత్రుడిగా సంబోధిస్తారు.
వైసీపీ నేతలో గుబులు అదే.. బాబు-పవన్ కలిసి పోటీ చేస్తే వైసీపీ మీదున్న వ్యతిలేఖత జగన్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓట్లు మొత్తం టీడీపీ-జనసేనకు వెళ్లిపోతాయి. అందుకే వీరిద్దరిని కలిపి తిడుతూ వారిని కలవకుండా చేద్దామనుకుంటున్నారు. కానీ 2024 ఎన్నికల సమయానికి ఏది ఎటు మారుతుందో చూద్దాం.