Advertisementt

జగ్గు భాయ్ అంటూ ర్యాగింగ్ చేస్తున్న పవన్

Fri 14th Jul 2023 10:07 PM
pawan kalyan  జగ్గు భాయ్ అంటూ ర్యాగింగ్ చేస్తున్న పవన్
CM Jagan Comments Vs Pawan Kalyan Raging జగ్గు భాయ్ అంటూ ర్యాగింగ్ చేస్తున్న పవన్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ని పదే పదే ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు, మూడు పెళ్లి చేసుకున్నాడు అంటూ వైసీపీ నేతలే కాదు.. సాక్షత్తు సీఎం జగన్ గారే పదే పదే పాట పాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ని అంటే ఆయనకి నోరు లేదా.. ఆయన అనలేరా అందుకే జగన్ కి ఇకపై గౌరవం ఇచ్చేది లేదు.. ఏకవచనంతోనే జగన్ అని పిలుస్తాను అంటూ పవన్ కళ్యాణ్ డిసైడ్ అవ్వగానే YCP మంతులు ఒక్కొక్కరికి మాటల దాడికి దిగారు. జగన్ అయితే అనొచ్చు. పవన్ అనకూడదు. ఇదెక్కడి రూలో ఎవ్వరికీ తెలియదు. తాజాగా పవన్ కళ్యాణ్ తణుకు బహిరంగ సభలో జగన్ ని చేసిన ర్యాగింగ్ అందరికి షాకిస్తుంది. నవ్వు తెప్పించింది.

జగన్.. నన్ను పవన్ అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు, దత్త పుత్రుడు అంటారు.. నేను ఇప్పటివరకు చాలా భరించా. కానీ, నిన్ను జగ్గుభాయ్‌ అంటుంటే వైసీపీ నేతలు బాధపడుతున్నారు. జగన్ గారు అని సంబోధించడం నుంచి జాగ్గు భాయ్‌కి వచ్చా. తర్వాత జగ్గు అంటా. ఆ తర్వాత ఏం అంటానో నాకే తెలియదు అంటూ పవన్ కళ్యాణ్ జగన్ న చేసిన ర్యాగింగ్ మాములుగా లేదు.. మరి నిజమే కదా. ఒకరిని వేలెత్తి చూపిస్తే వాళ్ళు మనల్ని వదలరు కదా.. నువ్ సీఎం అయితే ఏమిటి ఇంకేమన్నా అయితే ఏమిటి.. అంటూ జనసేన కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు.

CM Jagan Comments Vs Pawan Kalyan Raging:

Pawan Kalyan strong counter to CM Jagan

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ