Advertisementt

బేబీ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్

Fri 14th Jul 2023 07:38 PM
baby  బేబీ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Baby OTT partner revealed బేబీ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కి నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన బేబీ మూవీని ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకున్నారు. SKN నిర్మాతగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ మూవీని ముందుగా ఓటిటి రిలీజ్ చేస్తామని మేకర్స్ అనుకున్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసారు. మేకర్స్ నమ్మకమే నిజమైంది. ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ తోనే బేబీ మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఈరోజు విడుదలైన ఈ చిత్రం బావుంది అంటూ పబ్లిక్ చెబుతున్నారు. మంచి ప్రమోషన్స్ తో టీమ్ కష్టానికి ఫలితం దక్కింది. బేబీ చిత్రం హిట్ అవడంతో అందులో నటించిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్యలని పొగుడుతున్నారు. ఇంకా క్లైమాక్స్ బావున్నట్టయితే సినిమా సూపర్ హిట్ లిస్ట్ లోకి చేరిపోయేది. కానీ క్లైమాక్స్ వీక్ రావడంతోనే బాబు ఆ లిస్ట్ లోకి వెళ్లలేకపోతుంది. అయినప్పటికీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే  అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే నేడు థియేటర్స్ లో విడుదలైన ఈమూవీ ఓటిటి పార్ట్నర్ గా ఆహా ఉంది. ఆహా మంచి ధరతో బేబీ ఓటిటి హక్కులని కొనేసింది. అయితే ఈ చిత్రం హిట్ అవడంతో ఇప్పుడు ఆహా నుండి బేబీ మూవీ ఓ నెల తర్వాతే అంటే ఆగష్టు 15 కి అలా ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

Baby OTT partner revealed:

Official OTT Partner Of Today New Release Baby

Tags:   BABY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ