Advertisementt

RC16.. జాన్వీ పోయి మృణాల్ వచ్చె

Wed 19th Jul 2023 12:35 PM
rc16,mrunal thakur,heroine,jahnvi kapoor,ram charan,buchibabu sana  RC16.. జాన్వీ పోయి మృణాల్ వచ్చె
Janhvi Kapoor Out and Mrunal Thakur In For RC16 RC16.. జాన్వీ పోయి మృణాల్ వచ్చె
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో త్వరలో RC16 చిత్రం తెరకెక్కబోతోంది. ప్రస్తుతం సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పూర్తవ్వగానే RC16 చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈలోపు ఈ సినిమాకు కావాల్సిన సరంజామాని బుచ్చిబాబు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లుగా స్వయంగా ఆయనే చెప్పారు. దీంతో సంగీత దర్శకుడు ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసింది. అలాగే ఈ సినిమా నిర్మించే వారిపై కూడా ఓ క్లారిటీ ఉంది. ఇప్పుడు హీరోయిన్ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేసినట్లే టాక్ వినబడుతోంది. 

ముందు నుంచి ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందనేలా వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ఎన్టీఆర్ ‘దేవర’తో జాన్వీ కపూర్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది కాబట్టి.. చరణ్ సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్ నడిచింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో భామ పేరు తెరపైకి వచ్చింది. అవును.. ఈ సినిమాలో ‘సీతా రామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా సెలక్ట్ అయిందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. చిత్రయూనిట్ నుంచి అయితే ఎటువంటి సమాచారం రాలేదు కానీ.. మృణాల్ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. 

మరి నిజంగా మృణాల్ ఇందులో నటిస్తుందా? లేదంటే.. ఈ మధ్య కొందరు హీరోయిన్లు.. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న టైమ్‌లో.. పలానా హీరోయిన్ అట అనేలా వార్తలు స్పెడ్ చేయిస్తున్నట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. ఇదొక స్ట్రాటజీ. త్రివిక్రమ్ సినిమాలకు ఎలా అయితే సోషల్ మీడియాలో టైటిల్స్ ముందుగానే వచ్చేస్తాయో.. అలా హీరోయిన్లు, వారి మేనేజర్స్‌తో చేయించే ట్రిక్ ఇది. ఇప్పుడు RC16 విషయంలో కూడా అలా ఏమైనా జరుగుతుందా? అనేలా కొందరు మెగా ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు హీరోయిన్‌ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే వరకు ఇంకా ఎన్ని పేర్లు ఈ విషయంలో తెరపైకి వస్తాయో చూడాలి..  

Janhvi Kapoor Out and Mrunal Thakur In For RC16:

Mrunal Thakur To Romance Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ