Advertisementt

ఇంత సింపుల్‌గా అంటే కష్టమేమో..

Fri 14th Jul 2023 01:15 PM
srinidhi shetty,kgf fame,srinidhi shetty photoshoot  ఇంత సింపుల్‌గా అంటే కష్టమేమో..
Srinidhi Shetty Latest Photoshoot Pics Goes Viral ఇంత సింపుల్‌గా అంటే కష్టమేమో..
Advertisement
Ads by CJ

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఇప్పుడొక రేంజ్‌లో ఉండాల్సిన హీరోయిన్. ఎందుకంటే KGF లాంటి పాన్ ఇండియా హిట్స్ తర్వాత అందులో నటించిన హీరోయిన్‌కి ఏ రేంజ్ క్రేజ్ ఉండాలి. కానీ శ్రీనిధి శెట్టి బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఆమెకి KGF సీరీస్ తర్వాత అలాంటి భారీ బడ్జెట్ మూవీ అవకాశాలు రాలేదు. తమిళనాట ఆమె నటించిన కోబ్రా లాంటి మూవీస్ ఆమెని బాగా నిరాశ పరిచాయి. KGF తర్వాత శ్రీనిధి శెట్టి పారితోషికం అమాంతం పెంచేసింది అనే టాక్ వినిపించింది.

గ్లామర్ గర్ల్‌గా KGFలో కనిపించకపోయినా సింపుల్ లుక్స్ తోనే ఆకట్టుకున్న శ్రీనిధి.. ఆ తర్వాత పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేస్తాయని ఆమె ఆశపడింది. కానీ ఆమెకి అనుకున్న అవకాశాలు రాకపోగా ప్రస్తుతం ఖాళీగా కనబడుతుంది. అందుకే సోషల్ మీడియాని నమ్ముకుని తరచూ ఫోటో షూట్స్‌ని షేర్ చేస్తుంది. కానీ ఆమె గ్లామర్‌గా అందాలు ఆరబోసే పని పెట్టుకోలేదు. సింపుల్‌గా శ్రీనిధి శెట్టి అవుట్ ఫిట్స్ ఉంటున్నాయి. ఆమె లుక్స్ కూడా అంతే సింపుల్‌గా ఉంటున్నాయి.

శారీస్, చుడీదార్స్ లాంటివి మాత్రమే ధరిస్తూ కనబడుతుంది తప్ప గ్లామర్ అవుట్ ఫిట్స్‌లో మాత్రం శ్రీనిధి కనిపించలేదు. తాజాగా బెడ్‌పై పడుకుని తెగ ఆలోచించేస్తున్న పిక్స్ షేర్ చేసింది. Hitting the bed! Literally 😴 అంటూ క్యాప్షన్ పెట్టిన శ్రీనిధి ఈ బెడ్ పిక్స్ కూడా చాలా సింపుల్‌గా కనిపించాయి. మరి ఫోటో షూట్స్ అంటే ఇతర హీరోయిన్స్‌ని చూసి నేర్చుకోవాల్సిందే. గ్లామర్ చూపించడానికి వారు వెతుకుతున్న మార్గాలే వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయి. కానీ శ్రీనిధి ఇంకా ఇలా ట్రెడిషనల్ లుక్స్‌నే నమ్ముకుంటే కష్టం సుమీ.

Srinidhi Shetty Latest Photoshoot Pics Goes Viral:

KGF Beauty Srinidhi Shetty Cute Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ