Advertisementt

కూతురుపై కళ్యాణ్ దేవ్ పోస్ట్‌లు వైరల్

Fri 14th Jul 2023 09:30 AM
kalyaan dhev,daughter,emotion,srija,mega daughter,niharika  కూతురుపై కళ్యాణ్ దేవ్ పోస్ట్‌లు వైరల్
Kalyaan Dhev Posts on His Daughter Goes Viral కూతురుపై కళ్యాణ్ దేవ్ పోస్ట్‌లు వైరల్
Advertisement
Ads by CJ

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ.. భర్త కళ్యాణ్ దేవ్‌తో విడిపోయింది. ఆమె విడాకుల విషయంలో మెగా ఫ్యామిలీ కానీ, శ్రీజ కానీ క్లారిటీ ఇవ్వకపోయినా.. కళ్యాణ్ దేవ్ మాత్రం పదే పదే పలు రకాల పోస్ట్‌లతో తాము విడిపోయామనే సంకేతాలు ఇస్తూ వస్తున్నాడు. తన కూతురుతో వారానికి ఒకరోజు.. కేవలం నాలుగు గంటల పాటు గడుపుతున్నట్టుగా ఈమధ్యనే ఓ పోస్ట్ పెట్టాడు. అయితే శ్రీజ మాత్రం నిహారికలా డేరింగ్‌గా తన విడాకుల విషయాన్ని పబ్లిక్‌కి చెప్పలేదు. ఇంకా ఇంకా ఈ విషయంలో దాగుడుమూతలాడుతోంది. కానీ అసలు విషయం మాత్రం రివీల్ చేయడం లేదు.

తాజాగా కళ్యాణ్ దేవ్ తన కుమార్తెని ఎంతగా మిస్ అవుతున్నాడో అనేది అతను పెట్టిన పోస్ట్ చూస్తే తెలుస్తుంది. రీసెంట్‌గా కళ్యాణ్ దేవ్ బర్త్ డే జరిగింది. తన బర్త్ డే సెలెబ్రేషన్స్ లో కళ్యాణ్ దేవ్ కేక్ కట్ చేసిన పిక్‌ని షేర్ చేస్తూ.. మిస్ యు మై బేబీ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అంటే తన బిడ్డని వారానికి నాలుగు గంటలు కలిసి ఆడుకుంటున్న తను.. మిగతా రోజుల్లో తనని ఎంతగా మిస్ అవుతున్నాడో ఈపోస్ట్ చూస్తే అర్ధమవుతుంది. ఇక కళ్యాణ్ దేవ్ పోస్ట్ చేసిన పిక్‌లో ఆయన తల్లి కూడా ఉన్నారు.

శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడిపోయాక తన పేరెంట్స్‌తో కలిసి ఉంటున్నాడు. శ్రీజ కూడా తన తల్లితండ్రులతో కలిసి తన పిల్లలని చూసుకుంటుంది. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం ఇంత వరకు వెల్లడి కాలేదు. కానీ.. కళ్యాణ్ దేవ్ పోస్ట్‌లు చూసిన వారంతా.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. 

Kalyaan Dhev Posts on His Daughter Goes Viral:

Miss You May Baby Kalyaan Dhev Posted in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ