ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షోస్ కి రారాజుగా నిలిచిన జబర్దస్త్ ఇప్పుడు మసకబారిపోతుంది. గతంలో టాప్ కమెడియన్స్ జబర్దస్త్‌లో కామెడీ చేయడంతో ఆ షోకి మంచి టీఆర్పీ వచ్చేది. అందులోనూ గురు, శుక్రవారం ఎపిసోడ్స్‌లో కమెడియన్స్ స్కిట్స్ చేస్తూ కామెడీ పండించేవారు. ఈటీవీలోనే కాదు జబర్దస్త్ యూట్యూబ్‌లో కూడా పాపులర్ షో గా మారిపోయింది. అప్పట్లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, చలాకి చంటి, అదిరే అభి లాంటి వారు ఉండేవారు. షో ని కామెడీగా నడిపించేవారు.
కానీ ఇప్పుడు చంటి, సుధీర్, శ్రీను, ఆది, అభి ఇలా పేరున్న కమెడియన్స్ మొత్తం జబర్దస్త్‌కి దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో బిజీ అవడమో.. లేదంటే జబర్దస్త్ రెమ్యునరేషన్స్‌లో తేడా రావడమో మొత్తానికి వీరంతా జబర్దస్త్ నుండి బయటికెళ్లిపోయారు. అయితే ఇప్పుడు జబర్దస్త్‌కి కమెడియన్స్ కొరత స్పష్టంగా కనబడుతుంది. ఏదో జబర్దస్త్ లోకి నెల్లూరు నీరజ అనే కొత్త టీం ని దించారు. అలాగే ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లో పిల్ల గ్యాంగ్‌ని టీమ్ లీడర్స్‌ని చేశారు.
చిన్న పిల్లలని పట్టుకొచ్చి ఓ టీమ్‌గా ఫామ్ చేసి వాళ్లతో కామెడీ చేయిస్తున్నారు. ఇక ఒక జబర్దస్త్‌కి ఇంద్రజ-కృష్ణభగవాన్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌కి ఖుష్బూ-కృష్ణ భగవాన్ జడ్జెస్‌గా వస్తుంటే .. వారం వారం సినీ మేకర్స్ వచ్చి తమ తమ సినిమాని జబర్దస్త్ ద్వారా ప్రమోట్ చేసుకుంటున్నారు. మొత్తానికి జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్‌లు మాత్రం ఇప్పుడు డేంజర్ జోన్ లోనే కనబడుతున్నాయి. చూద్దాం.. మళ్లీ మంచిరోజులు ఎప్పుడొస్తాయో..