Advertisementt

Nani30.. ‘హాయ్ నాన్న’ టచింగ్‌గా గ్లింప్స్

Thu 13th Jul 2023 08:58 PM
hi nanna,nani30,natural star nani,mrunal thakur,hi nanna glimpse  Nani30.. ‘హాయ్ నాన్న’ టచింగ్‌గా గ్లింప్స్
Natural Star Nani 30th Film Name is Hi Nanna Nani30.. ‘హాయ్ నాన్న’ టచింగ్‌గా గ్లింప్స్
Advertisement
Ads by CJ

నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ మూవీ #Nani30 నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘హాయ్ నాన్న’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు వదలిన గ్లింప్స్ చూస్తుంటే.. ఇది సంగీత ప్రధానంగా సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అనిపిస్తుంది. 

ఈ గ్లింప్స్‌లో ఓ పాప.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని ‘మై ఫ్రెండ్ యశ్న’ అని పరిచయం చేసింది. ఆ తర్వాత నానినీ ‘మా నాన్న’ అని పరిచయం చేసింది. చివరికి మృణాల్ ఠాకూర్ కూడా పాప ఎదురుగా కూర్చున్న నానీని ‘హాయ్ నాన్న’ అంటూ పరిచయం చేసుకుంటుంది. గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను ఏర్పడేలా చేస్తుంది. ఇక ఇందులో నాని ఓ సందర్భంలో ఇచ్చిన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, అదే సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే ఓ కొత్త కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా వస్తుందనే విషయాన్ని మాత్రం ఈ గ్లింప్స్ తెలియజేసింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ ఒక్క గ్లింప్స్‌తోనే హిట్ కళ కొట్టిచ్చినట్లుగా కనిపిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు. హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

Natural Star Nani 30th Film Name is Hi Nanna:

Nani Next Film Hi Nanna Glimpse Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ