రేపు శుక్రవారం బాక్సాఫీస్ వద్ద హడావుడి పెద్దగా కనిపించడం లేదు. గత శుక్రవారం పొలోమంటూ ఆరేడు సినిమాలు విడుదలయ్యాయి కానీ.. అవి సో సో మూవీస్ కావడంతో ప్రేక్షకుల కన్ను ఈ వారంపై పడింది. ఈ వారం కూడా అంత ఇంట్రెస్ట్ కలిగించే సినిమాలేవీ కనిపించకపోయినా.. చిన్న సినిమాగా బేబీ తెలుగు ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది. గతంలో బేబీని ఓటీటీలో రిలీజ్ చేస్తారని అన్నప్పటికీ.. ఇప్పుడు ఇది థియేటర్స్‌లో విడుదలైతే ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో నిర్మాతలు రేపు శుక్రవారం అంటే జులై14 న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ప్రమోషన్స్ కూడా యమా జోరుగా నిర్వహిస్తున్నారు
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, యూట్యూబర్ వైష్ణవి ప్రధాన తారాగణంగా నటించిన బేబీ రేపు విడుదల కాబోతుండగా.. ఈ బేబీకి రెండు డబ్బింగ్ సినిమాలు అడ్డుపడుతున్నాయి. అందులో శివ కార్తికేయన్ మహావీరుడు, ఇంకొకటి ఉదయనిధి స్టాలిన్-ఫహద్ ఫాసిల్-కీర్తి సురేష్‌ల నాయకుడు. ఈ రెండు సినిమాల మధ్యన బేబీ పరిస్థితి ఏమిటో అని అందరూ అనుకుంటున్నారు. ‘బేబీ’కి పాజిటివ్ టాక్ వస్తే ఓకే.. లేదంటే ఈ డబ్బింగ్ మూవీస్ మధ్యన నలిగిపోవడం ఖాయమనే అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు.
అయితే కలర్ ఫొటోతో నేషనల్ అవార్డ్ కొట్టిన నిర్మాత.. బేబీ చిత్రానికి దర్శకుడు కావడంతో.. ఇందులో ఏదో విషయం ఉన్నట్లే అనిపిస్తుంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో.. తెలుగు ప్రేక్షకులు బేబీకే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూద్దాం.. ఈ వారం ఏ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుందో అనేది.. బేబీ నా లేదంటే మహావీరుడా లేదంటే నాయకుడా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. అన్నట్లు ఇవే కాకుండా ఇంకో రెండు మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ని రేపు పలకరించనున్నాయి.