Advertisementt

RC16 మ్యూజిక్ డైరెక్టర్ కన్ ఫామ్

Wed 12th Jul 2023 09:20 PM
rc16  RC16 మ్యూజిక్ డైరెక్టర్ కన్ ఫామ్
RC16 Music Director fixed RC16 మ్యూజిక్ డైరెక్టర్ కన్ ఫామ్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ నిన్న మంగళవారం నుండి శంకర్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇండియన్ 2 నుండి బ్రేక్ తీసుకున్న శంకర్ హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టారు. ఈ విషయాన్ని శంకర్ సరదాగా అప్ డేట్ కూడా ఇచ్చారు. అయితే రామ్ చరణ్ తన తదుపరి మూవీని ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు తో మొదలు పెట్టబోతున్నారు. బుచ్చి బాబు-రామ్ చరణ్ కలయికలో మొదలు కాబోతున్న RC16 మూవీ ఆగష్టు ఫస్ట్ వీక్ లో పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుద్ రవిచంద్రన్ కానీ, ఏ ఆర్ రెహ్మాన్ కానీ చేసే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరగగా.. నేడు ఏ ఆర్ రెహమాన్ హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్లో తాను RC16 కి మ్యూజిక్ అందించబోతున్నట్లుగా కన్ ఫామ్ చేసారు. నేను RC16 మ్యూజిక్చే అందించబోతున్నాను. ఇది చాలా ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్.. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను అంటూ ఏ ఆర్ రెహ్మాన్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. దానితో RC16 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆస్కార్ విజేత RC16 మ్యూజిక్ డైరెక్టర్ గా వస్తున్నారంటే మెగా ఫ్యాన్స్ లో సంతోషం ఉప్పొంగిపోతుంది.

ఇక బుచ్చి బాబు రామ్ చరణ్ తో చెయ్యబోయే మూవీ స్క్రిప్ట్ ని లాక్ చేసేసి.. నటుల ఎంపిక మొదలు పెడతారని తెలుస్తుంది. ఈచిత్రం కోసం రామ్ చరణ్ సరసన ఓ క్రేజీ హీరోయిన్ ని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. 

RC16 Music Director fixed:

AR Rahman to compose music for RC 16

Tags:   RC16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ