Advertisementt

కృతి శెట్టి స్టైలిష్ అందాలు

Wed 12th Jul 2023 07:51 PM
krithi shetty  కృతి శెట్టి స్టైలిష్ అందాలు
Krithi Shetty stylish beautiful look కృతి శెట్టి స్టైలిష్ అందాలు
Advertisement
Ads by CJ

యంగ్ బ్యూటీ కృతి శెట్టి అందాలు తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కృతి శెట్టి ఎక్కువ లో ప్రొఫైల్ మెయింటింగ్ చేసింది. కానీ ఇప్పుడు వరస డిజాస్టర్స్ తో సతమతమవుతున్న కృతిశెట్టి ప్లాన్ మార్చింది. అందాలతో అభిమానులకి దగ్గరవుతుంది. అందుకు సోషల్ మీడియానే ప్రధానమార్గమని తెలుసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్ ని షేర్ చేస్తూ కవ్విస్తుంది. రీసెంట్ గా తమిళనాట జయం రవి తో ఓ మూవీకి సైన్ చేసింది.

ఆ మూవీ ఓపెనింగ్ తో కృతి శెట్టి హవా సోషల్ మీడియాలో కనిపించింది. అలాగే ఈమధ్యన ఓ స్టార్ హీరో కొడుకు ఆమెని వేధించాడంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. తమిళ మీడియాలో తానొక హీరో గారి కొడుకుపై ఆరోపణలు చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టింది. అయితే తాజాగా కృతి శెట్టి కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఆ పిక్స్ లో ఆమె పంజాబీ అవుట్ ఫిట్ లో క్యూట్ గా స్వీట్ గా కనిపించింది. లైట్ కలర్ డ్రెస్ లో ముద్దుగా కనిపించింది.

లూజ్ హెయిర్ తో చెవులకి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ తో అదిరిపోయే ఫోజులిచ్చింది. వాలు చూపులతో మత్తెక్కించేలా మెస్మరైజ్ చేసింది. మరి మీరు బ్యూటిఫుల్ కృతి శెట్టి అందాలపై ఓ లుక్కేసెయ్యండి.

Krithi Shetty stylish beautiful look:

Actress Krithi Shetty looks classy and elegant

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ