Advertisementt

చరణ్ తర్వాత విజయ్ వస్తే రణవీర్ ఏమవుతాడు

Wed 12th Jul 2023 04:24 PM
vijay-shankar  చరణ్ తర్వాత విజయ్ వస్తే రణవీర్ ఏమవుతాడు
Vijay, Shankar combination on cards చరణ్ తర్వాత విజయ్ వస్తే రణవీర్ ఏమవుతాడు
Advertisement
Ads by CJ

కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ లైనప్ చూస్తే బాబోయ్ అనిపించేలా ఉంది. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2-రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అంటూ దోబూచులాడుతున్న శంకర్ తన తదుపరి బాలీవుడ్ టాప్ హీరో రణవీర్ సింగ్ తో అపరిచితుడికి రీమేక్ ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పూర్తి కాగానే శంకర్ అపరిచితుడు రీమేక్ కోసం వెళ్లాల్సి ఉంది. కానీ మధ్యలో లైకా ప్రొడక్షన్ వారు ఎంటర్ అయ్యి ఇండియన్ 2 షూటింగ్ మొదలు పెట్టించారు. మరోపక్క అపరిచితుడు ఒరిజినల్ నిర్మాత శంకర్ పై కోర్టుకెళ్లాడు.

అయితే అదంతా అలా ఉండగా.. ఇప్పుడు శంకర్ గేమ్ ఛేంజర్-ఇండియన్ 2 తర్వాత హీరో విజయ్ తో సినిమా చేయబోతున్నారంటూ ఓ న్యూస్ కోలీవుడ్ ఫిలిం స్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ తో LEO షూటింగ్ కంప్లీట్ చేసి ఫ్రీ అయ్యారు. ఆయన తన తదుపరి మూవీని వెంకట్ ప్రభుతో చెయ్యబోతున్నారు. ఈ చిత్రంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పుడు విజయ్ శంకర్ తో మరో మూవీ చేయబోతున్నారనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.. విజయ్ కెరీర్ లో 69 లేదా 70వ సినిమాగా ఇది ఉండొచ్చని టాక్. 

విజయ్ తో శంకర్ మూవీ ఓకె అయితే రణవీర్ పరిస్థితి ఏమిటి. అంటే విజయ్-శంకర్ కాంబో ఇప్పట్లో ఉండకపోవచ్చు.. ఇండియన్ 2-గేమ్ ఛేంజర్ తర్వాత శంకర్ రణవీర్ సింగ్ తోనే అపరిచితుడు రీమేక్ తో సెట్స్ మీద కి వెళ్లిపోయే ఛాన్స్ అయితే లేకపోలేదు.

Vijay, Shankar combination on cards:

Hero Vijay-Shankar Movie Is On Cards? 

Tags:   VIJAY-SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ