హీరోలు ఏం చేసినా అది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. అభిమానులు హీరోలు ఎలా ఉంటారో.. ఏం చేస్తారో అదే ఫాలో అవుతూ ఉంటారు. అందుకే హీరోలు ఏదైనా ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తే ప్రజలు ఎగబడి కొంటారు. పలు కంపెనీలు కూడా తమ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి స్టార్ హీరోలకు కోట్లకి కోట్లు పోసి యాడ్ షూట్స్ చేసి ప్రొడక్ట్స్ ని ప్రమోషన్స్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కారు చెన్నై లో సిగ్నల్ జంప్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అది విజయ్ తన అభిమానులతో మీటింగ్ పెట్టి అది పూర్తి కాగానే కారులో రోడ్ మీద వస్తూ ఉంటే ఎదురుగా వీడియో తీస్తూ ఉన్నారు కొందరు. ఓ చోట సిగ్నల్ పడగా.. అన్ని వాహనాలు సిగ్నల్ దగ్గర ఆగినా విజయ్ కారు మాత్రం ఆగకుండా సింగ్నల్ జంప్ చేసిన దానికి కూడా షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగానే విజయ్ పై పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ విజయ్ కారు సిగ్నల్ జంప్ చెయ్యడం చూసిన పోలీసులు విజయ్ కి ఫైన్ వేశారు.
ట్రాఫిక్ పోలీస్లు విజయ్ కారు రెడ్ సిగ్నల్ పడినా ఆగకుండా వెళ్లినందుకు గాను 500 రూపాయలు ఫైన్ వెయ్యగా.. నెటిజెన్స్ మాత్రం ఏంటి విజయ్.. హీరో అయ్యుండి.. మీరే ఇలా సిగ్నల్ జంప్ చేసి ఫాన్స్ ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు మిమ్మల్ని చూసి అభిమానులు కూడా ఇలానే చేస్తారుగా అంటూ విజయ్ ని విమర్శిస్తున్నారు.