Advertisementt

రోజక్క నీతులు చెబుతుందిరోయ్!

Wed 12th Jul 2023 12:00 PM
roja  రోజక్క నీతులు చెబుతుందిరోయ్!
Raja fires on Pawan Kalyan రోజక్క నీతులు చెబుతుందిరోయ్!
Advertisement
Ads by CJ

టీడీపీ నుండి ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్లి నగరి నుండి ఎమ్యెల్యేగా గెలిచి కొన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో లేకపోయినా.. జగన్ కి భజన చేస్తూ అసెంబ్లీలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మిగతా టీడీపీ నేతలను నోటికొచ్చినట్లుగా మాట్లాడి జగన్ దగ్గర మార్కులు కొట్టేసేది. మరో ఎమ్యెల్యే కోడలి నాని, రోజా నోరు విప్పితే బూతులు. పెద్దవాడని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్లుగా మట్లాడేవారు. వాడు, వీడు, సన్నాసి, వెధవ అంటూ చంద్రబాబుని సంభోదిస్తూ చివరికి జగన్ ప్రభుత్వంలో పదవులు పట్టేసారు. రోజా ప్రస్తుతం మినిస్టర్ పదవిని అనుభవిస్తుంది.

అయితే రోజా ఇప్పడు పవన్ కళ్యాణ్ కి నీతులు చెప్పడం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి అండదండలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థని కించపరిచారంటూ గత రెండు రోజులుగా అక్కడి YCP నేతలు, మంత్రులు అంతా పవన్ పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక రోజా అయితే నీతులు చెప్పడం మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ కి వయసొచ్చినా బుద్ది రాలేదు. సీఎం పదవిలో ఉన్న జగన్ గారిని ఏ వచనంతో సంభోదిస్తాడా.. మీ అమ్మ సంస్కారం నేర్పించలేదా.. నీ వల్ల అందరూ మీ అమ్మను అనే పరిస్థితి వచ్చింది పవన్..

అమ్మా.. నన్ను క్షమించమ్మా..! పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడం ఎంతవరకు కరెక్ట్.. అతనికి సంస్కారమే లేదు, ఇంట్లో వాళ్ళు నేర్పించకపోతే అతనేం చేస్తాడు. అందుకే ఆయన తల్లిని అనే పరిస్థితి వచ్చింది, అంటూ మరోసారి అమ్మా నన్ను క్షమించాడమ్మా అంటూ పవన్ తల్లిగారికి సారి చెప్పింది. ఇది చూసిన నెటిజెన్స్ జగన్ ని ఏకవచనంతో సంభోదిస్తేనే నువ్వు ఇన్ని నీతి మాటలు మాట్లాడుతున్నావ్.. అదే చంద్రబాబుని నువ్వు నీచుడు, వెధవ అన్న సందర్భాల్లో ఈ నీతులు గుర్తుకు రాలేదా తల్లీ అంటూ రోజాని ప్రతి పక్షాలు నిలదీస్తున్నాయి.

Raja fires on Pawan Kalyan:

Minister Roja Fires On Pawan Kalyan His Comments On Volunteers

Tags:   ROJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ