ఇప్పటివరకు తెలుగు హీరోల కోసం గొడవలు పడిన అభిమానులు ఇప్పుడు బాలీవుడ్ vs టాలీవుడ్ అన్న రేంజ్ లో గొడవ స్టార్ట్ చేసారు. అసలే టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ బాక్సాఫీసుపై దండెత్తి కోట్లు కొల్లగొట్టడం చూసిన హిందీ ప్రముఖులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంటే.. ఇప్పుడు సలార్ టీజర్ ని మా జవాన్ ట్రైలర్ తొక్కేసింది అంటూ SRK అభిమానులు బయలుదేరారు. బాహుబలి తో హిందీలో బలంగా జెండా పాతిన ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఎంతగా ఇష్టపడ్డారో సాహో నిరూపించింది.
తాజాగా సలార్ టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే యూట్యూబ్ లో 85 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇది కదా రికార్డ్ అంటూ ప్రభాస్ ఫాన్స్ చాలా మురిసిపోయారు. నిన్న జవాన్ ప్రివ్యూ అంటూ విడుదలైంది. షారుఖ్-అట్లీ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా జవాన్ ప్రివ్యూ ని రిలీజ్ చెయ్యగా.. అది 112 మిలియన్ వ్యూస్ ని రాబట్టింది అంటూ నిర్మాత ప్రకటించడంతో ప్రభాస్ అభిమానులు భగ్గుమన్నారు. సలార్ టీజర్ లో ప్రభాస్ అన్న జస్ట్ కొద్ది సెకన్స్ మాత్రమే కనిపించారు. దానికే 24 గంటల్లో 85 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ జవాన్ ప్రివ్యూ లో షారుఖ్, నయన్, దీపికా, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఉన్నారు. మొత్తం యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ అది.. అయిన మీ వ్యూస్ ఎక్కడా యూట్యూబ్ లో కనిపించనే లేదు అంటూ ప్రభాస్ ఫాన్స్ జవాన్ వ్యూస్ పై పడుతున్నారు.
సోషల్ మీడియాలో మొత్తం మా హీరో ప్రభాస్ గొప్ప అంటే.. కాదు మా హీరో షారుక్ గొప్ప అంటూ అభిమానుల మధ్యన మాటల యుద్ధం మొదలయ్యింది. ఇదంతా చూసిన నెటిజెన్స్ ఇదెక్కడి గోలరా. నిన్నటివరకు తెలుగు హీరోల అభిమానులు తన్నుకు చస్తే ఇప్పుడు హిందీ వాళ్ళు కూడా బయలు దేరారు అంటూ విసుగుని ప్రదర్శిస్తున్నారు.