జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థని కించపరిచారంటూ నిన్నటి నుండి ఏపిలో వాలంటీర్లు అంతా ధర్నాలు, నిరససనలు, రాస్తా రోకోలు, పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దగ్ధం చేయడాలు అబ్బో ఓ రేంజ్ లో ఉంది అక్కడ యవ్వారం. పవన్ కళ్యాణ్ సారి చెప్పాలంటూ వాలంటీర్లు ధర్నాలు మొదలు పెట్టారు. ఏపీ ప్రభుత్వానికి వెన్నుముకగా ఉన్న వాలంటీర్లని పవన్ అలా మట్లాడుతూ అవమానించారంటూ అంటూ ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడుతున్నారు. వారాహి యాత్రతో పవన్ గ్రాఫ్ ఎక్కడ పెరిగిపోయి ఆయన ఎలక్షన్స్ లో గెలిచేస్తాడో అని అని వైసీపీ ప్రభుత్వం తెగ టెన్షన్ పడిపోతుంది.
అందులో భాగంగానే వాలంటీర్లని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ పైకి ఉసిగొల్పారంటూ జనసేన నేతలు వాదిస్తున్నారు. అయితే తాజాగా మంగళగిరి ఎమ్యెల్యే RK వాలంటీర్ కాళ్ళు కడగడం హాట్ టాపిక్ అయ్యింది. తన నియోజకవర్గంలోని ఓ వాలంటీర్ కాళ్లు కడిగారు. నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో ఆళ్ల మంగళవారం పర్యటించారు. పవన్ వాలంటీర్ వ్యవస్థను అవమానించడం సరికాదన్నారు. అయితే ఈ ఎమ్యెల్యే గారు అమరావతిని రాజధాని కాదు.. మూడు రాజధానులు.. అందులో ఒకటి వైజాగ్, రెండోది అమరావతి, మూడోది కర్నూల్ అంటూ జగన్ ప్రకటించాకా ఆ మంగళగిరి ఏరియాలో కనిపించకుండా పోయి మళ్ళీ ఇప్పుడు హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ వాలంటీర్ కాళ్ళు కడగడం అందరిలో ఆశ్చర్యాన్ని ఆకలిగింది. అది చూసాక ఒక్క కాళ్ళు కడగడం ఏమిటి ఎలక్షన్స్ కోసం ఏమైనా చేస్తారు బ్రో.. అంటూ జనసేన కార్యకర్తలు కామెంట్ చేస్తున్నారు.
లేదంటే అమరావతిలో రైతులు గొంతెత్తి అరుస్తూ రాజధాని ఉద్యమం అంటూ కాలి నడకన తిరుపతి, అన్నవరం వెళితే ఈ రామకృష్ణ ఎక్కడా కనిపించలేదు. రాజధాని రైతులు ఎక్కడ తనని టార్గెట్ చేస్తారో అని కామ్ గా సైలెంట్ గా దాక్కున్న రామకృష్ణ ఇప్పుడు వాలంటీర్లని పవన్ అవమానించారంటూ లైవ్ లోకొచ్చి ఇలా కాళ్ళు కడగడం చూస్తే ఎలక్షన్స్ కోసం ఎలాంటి పనైనా చేస్తారంటూ జనసేన నేతలు RK ని ఆడుకుంటున్నారు.