నిహారిక కొణిదెలకి గుంటూరు కి చెందిన ఐజి ప్రభాకర్ రావు కొడుకు చైతన్య జొన్నలగడ్డనిచ్చి పెద్దలు గ్రాండ్ గా వివాహం చేసారు. 2020 డిసెంబర్ లో రాజస్థాన్ జైపూర్ ప్యాలెస్ లో ఇరు కుటుంబాలు, బంధువుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి అప్పట్లో చాలారోజులు మాట్లాడుకునేలా చేసారు. ఆ తర్వాత నిహారిక-చైతన్యలు హనీమూన్ అంటూ హడావిడి చేసారు. పెళ్లి తర్వాత నిహారిక ప్రొడక్షన్ వైపు రాగా.. చైతన్య జొన్నలగడ్డ తన జాబ్ చేసుకుంటున్నాడు. 2022 చివరికల్లా వీరి బంధం బీటలు వారింది. ఈ ఏడాది జనవరిలోనే నిహారిక-చైతన్యలు విడాకులకు అప్లై చెయ్యగా.. జూన్ లో వీరి విడాకుల విషయం బయటకొచ్చింది.
నిహారిక చైతన్యతో విడిపోతున్నట్లుగా ప్రకటించింది. తమ వ్యక్తిగత జీవితాల్లో తమని ప్రశాంతంగా ఉండనివ్వమని, కాస్త ప్రైవసీ వదలమని వేడుకుంది. అయితే వీరి విడాకుల తర్వాత నిహారిక కన్నా ఎక్కువగా చైతన్యని టార్గెట్ చేస్తున్నారు మెగా ఫాన్స్. అతన్ని సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో చైతన్య తండ్రి ప్రభాకర్ రావు అప్ సెట్ అయినట్లుగా తెలుస్తుంది. ఆయన ఈ విషయమై సన్నిహతుల దగ్గర మధనపడుతున్నారట. అసలు నిహారిక పెళ్లాయ్యాక పెద్దలంటే గౌరవం లేదు. మా ఇంట్లో వాళ్ళని ఎప్పుడూ గౌరవించలేదు. భర్తని ప్రేమగా చూసుకునేది కాదు. ఆమెకి సంసారం కన్నా క్లబ్బు, పబ్బులు అంటేనే ఇంట్రెస్ట్.
భర్తతో కలిసి హ్యాపీగా ఉండాలనే లేదు. కానీ ఇప్పుడు విడాకుల విషయంలో నా కొడుకుని అభిమానులు టార్చర్ పెడుతున్నారు. నా కొడుకు గురించి మెగా ఫాన్స్ తప్పుగా ప్రచారం చెయ్యడం భరించలేకపోతున్నాను అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇదంతా పక్కాగా అందిన సంచారమైతే కాదు.. జస్ట్ సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం ఒకటి స్ప్రెడ్ అయ్యింది.