వారం వారం కొత్త చిత్రాలు థియేటర్స్ లో వస్తుంటే.. థియేటర్స్ లో విడుదలైన చిత్రాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అంటూ పొలోమంటూ ప్రేక్షకుల మీదకి దండెత్తడానికి రెడీగా ఉంటాయి. మరి ఎప్పటిలాగే ఈ వారం కూడా నాలుగైదు చిత్రాలు థియేటర్లు లో విడుదలవుతుంటే.. బోలెడన్ని సినిమాలు, సీరీస్ లో ఓటిటీలలో ప్రత్యక్షమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్స్ లో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న చిత్రం ఆనంద్ దేవరకొండ బేబీ, ఆ తర్వాత తమిళం నుండి రెండు డబ్బింగ్ సినిమాలు ఈ వారమే అంటే జులై 14 న విడుదలకాబోతున్నాయి. అందులో శివ కార్తికేయన్ మహావీరుడు, ఉదయనిధి స్టాలిన్-ఫహద్ ఫాసిల్ నాయకుడు.. ఈవారమే విడుదలవుతున్నాయి.
థియేటర్స్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఓటీటీలపై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
జీ5 :
మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు)
నెట్‌ఫ్లిక్స్ :
కొహరా (హిందీ) జులై 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సోనీలివ్ :
క్రైమ్ పెట్రోల్ -48 అవర్స్ (హిందీ)
కాలేజ్ రొమాన్స్ (హిందీ)
డిస్నీప్లస్ హాట్‌స్టార్ :
జానకి జానీ (మలయాళం)
ది ట్రయల్ (హిందీ)