2020 లో కరోనా సమయంలో ప్రేమించిన గౌతమ్ కిచ్లు తో ఏడడుగులు వేసి.. చాలా కొద్దిరోజులకే బేబీ ని ప్లాన్ చేసుకుని కొడుకు ని కనేసిన కాజల్ అగర్వాల్ ఇకపై సినిమాలకి ఫుల్ స్టాప్ పెడుతుంది అనే అనుకున్నారు. పెళ్లి కాగానే భర్త కిచ్లు తో కలిసి మెగాస్టార్ ఆచార్య సెట్స్ లోకి వెళ్ళిపోయింది. కాజల్ ఎంత హడావిడిగా ఆచార్య సెట్స్ కి వెళ్లినా చివరికి ఆమె సీన్స్ కత్తిరించిపారేసారు. అయితే బాబు పుట్టాక కాజల్ కొద్దిపాటి గ్యాప్ తోనే ఇండియన్ 2 సెట్స్ లోకి వెళ్ళిపోయింది. కమల్ హాసన్ తో ఇండియన్ 2 లో నటిస్తున్న కాజల్ ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అలాగే బాలకృష్ణతో భగవంత్ కేసరి చిత్ర షూటింగ్స్ తో బాగా బిజీగా గడుపుతుంది.
కాజల్ కి షూటింగ్స్ నుండి కొద్దిపాటి గ్యాప్ దొరకడంతో భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి వెకేషన్స్ చెక్కేసింది. వెకేషన్ లో కాజల్ భారత తో కలిసి రొమాన్స్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అవి ఇట్టే వైరల్ గా మారాయి. పెళ్లి తర్వాత మాల్దీవుల్లో హనీమూన్ కి వెళ్లోచ్చిన ఈ జంట అప్పట్లో అక్కడి ఫొటోస్ ని కూడాషేర్ చేసారు. ఇక ఇప్పుడు భర్త తో కలిసి ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పిక్స్ లో కాజల్ క్యూట్ గా గ్లామర్ గా కనిపించింది.
పెళ్లి తర్వాత బాబు పుట్టాక కాజల్ అగర్వాల్ మరింతగా గ్లామర్ షో చేస్తుంది. గ్లామర్ విషయంలో అందాలు ఆరబోసే విషయంలో ఎక్కడా తగ్గడమే లేదు.