కొద్దిరోజులుగా గేమ్ ఛేంజర్ షూట్ కి బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ మళ్ళీ రేపు మంగళవారం కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 3 లాంగ్వజెస్ లో తెరకెక్కుతుంది. శంకర్ మధ్యలో ఇండియన్ 2 అంటూ వెళ్లిపోవడంతో గేమ్ ఛేంజర్ కి బ్రేకులు పడుతున్నాయి. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కోసం మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో మినీ యుద్ధం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో SJ సూర్య విలన్ గా సీఎం కేరెక్టర్ లో కనిపించబోతున్నారు.
రామ్ చరణ్ గత 2 రోజులుగా భార్య ఉపాసన దగ్గరే ఉంటున్నాడు. ఆయనకి జూన్ 20 న పాప పుట్టింది, మెగా ప్రిన్సెస్ అంటూ మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన పాపకి క్లింకారాగా నామకరణం చేసారు. మెగాస్టార్ చిరు తన మనవరాలికి పేరు పెట్టి బారసాల చేసి రీసెంట్ గానే భార్య సురేఖ తో ఓ చిన్నపాటి వెకేషన్ కోసం అమెరికా చెక్కేశారు. ఇక రామ్ చరణ్ ఈ 20 రోజులుగా తన పాప క్లింకార తో గడిపి తాజాగా గేమ్ ఛేంజర్ షెడ్యూల్ కి రెడీ ఆయారు. రేపటి నుండి అన్నపూర్ణ స్టూడియోస్, సారధి స్టూడియోస్ లో జరిగే చిత్రీకరణలో రామ్ చరణ్ పాల్గొంటారని తెలుస్తుంది.
ఈ షెడ్యూల్ ఎనిమిదిరోజులు ఉండబోతున్నట్లుగా సమాచారం. ఈ షెడ్యూల్ లో పాల్గొనేందుకు కియారా అద్వానీ కూడా హైదరాబాద్ కి రాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.