Advertisementt

అమర్ నాథ్ యాత్రలో నేచురల్ బ్యూటీ

Mon 10th Jul 2023 03:47 PM
sai pallavi  అమర్ నాథ్ యాత్రలో నేచురల్ బ్యూటీ
Sai Pallavi in Amarnath Yatra అమర్ నాథ్ యాత్రలో నేచురల్ బ్యూటీ
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోకి నేచురల్ బ్యూటీలా కాలు పెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి ఇప్పుడు టాలీవుడ్ కి లాంగ్ బ్రేక్ ఇచ్చింది. విరాటపర్వం తర్వాత సాయి పల్లవి మరో ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యలేదు. అయితే సినిమాల నుండి గ్యాప్ తీసుకుంటుంది అనుకుంటున్న సమయంలో సాయి పల్లవి కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శివ కార్తికేయన్ తో ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ సార్ట్ అయిన ఈచిత్రానికి సంబందించిన ఓ షెడ్యూల్ కాశ్మీర్ లో జరిగింది. ఈ షెడ్యూల్ కోసమే సాయి పల్లవి కాశ్మీర్ వెళ్ళింది. 

అయితే శివ కార్తికేయన్ ఈ చిత్ర షూటింగ్ ని పక్కనబెట్టి తన కొత్త చిత్రం మా వీరన్ ప్రమోషన్స్ లో బిజీ అవడంతో సాయి పల్లవి కి కాస్త సమయం దొరికింది. ఈ బ్రేక్ లో సాయి పల్లవి కాశ్మిర్ మంచుకొండల్లో కాలి నడకన అమరనాథ్ యాత్ర చేపట్టింది. మామూలుగానే దైవ భకురాలైన ఈ డాక్టర్ కమ్ యాక్టర్ సాయి పల్లవి.. అమరనాథ్ మంచు లో హిమలింగేశ్వరుడిని దర్శించుకుని అక్కడ ఆమె పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అమర్ నాథ్ యాత్రలో సాయి పల్లవిని చూసిన ప్రజలు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తిని కనబర్చారు.

Sai Pallavi in Amarnath Yatra:

Sai Pallavi Enjoying Amarnath Yatra Trip Shares Pics

Tags:   SAI PALLAVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ