Advertisementt

RRR సీక్వెల్ రాజమౌళి డైరెక్షన్ లో కాదా?

Mon 10th Jul 2023 01:26 PM
vijayendra prasad  RRR సీక్వెల్ రాజమౌళి డైరెక్షన్ లో కాదా?
RRR2 and Mahabharat to bow Hollywood RRR సీక్వెల్ రాజమౌళి డైరెక్షన్ లో కాదా?
Advertisement
Ads by CJ

రాజమౌళి ప్రస్తుతం మహెష్ తో చెయ్యబోయే SSMB29 ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసారు. స్క్రిప్ట్ వర్క్ దశలో SSMB29 ప్రాజెక్ట్ ఉండగా.. రాజమౌళి ఆర్.ఆర్. ఆర్ తర్వాత దానికి సీక్వెల్ చేస్తారని అన్నారు. అది మహేష్ ప్రాజెక్ట్ తర్వాతే ఉండబోతుంది అనుకున్నా ఇప్పుడు రాజమౌళి మహేష్ తో చెయ్యబోయే మూవీ తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పైకి వెళ్ళిపోతారట. తాజాగా రాజమౌళి తండ్రి, ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మహాభారతం ప్రాజెక్ట్ గురించి చెప్పి అందరిలో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసారు. రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సింహాద్రి విడుదలై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ గారు ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ వివరాలను, ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ సంగతులని రివీల్ చేసారు.

రాజమౌళి మహేష్ బాబు తో చెయ్యబోయే ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్ ని మించి అత్యంత భారీ స్థాయిలో ఉండనుందని, మహేష్ తో సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి మహాభారతంని రూపొందించనున్నారని ఆయన కీలక అప్ డేట్ ఇచ్చారు. ఆర్.ఆర్.ఆర్ తోనే ఇద్దరు స్టార్ హీరోలని కలిపిన రాజమౌళి మహాభారతం అంటే దేశంలోని అగ్ర నటులందరినీ భాగం చేస్తూ, పలు భాగాలుగా తెరకెక్కిస్తారు అనేది అందరికి తెలిసిందే. అయితే ఆర్.ఆర్.ఆర్ కి సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పిన ఆయన.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ అందులో భాగమవుతారని, దీనిని హాలీవుడ్ రేంజ్ లో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

అయితే ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ కి రాజమౌళి దర్శకత్వం వహించవచ్చు లేదా ఆయన పర్యవేక్షణలో వేరొకరు డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందంటూ విజయేంద్ర ప్రసాద్ అందరిని సస్పెన్స్ లో పడేసారురు. అంటే రాజమౌళి మహాభారతం ప్రాజెక్ట్ నుండి ఖాళీ అయితే ఆర్.ఆర్.ఆర్ డైరెక్షన్ చేస్తారు లేదంటే.. వేరే డైరెక్టర్ చేతిలో ఈ ప్రాజెక్ట్ సీక్వెల్ ని పెడతారన్నమాట. 

RRR2 and Mahabharat to bow Hollywood:

Vijayendra Prasad on RRR2 and Mahabharat

Tags:   VIJAYENDRA PRASAD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ